Subscribe

మేలైన బాట

By: admin Category: Uncategorized

చేమంతి, గులాబీ, మల్లిక

వసుధ ఆయె నేడు

అందాలకు వేదిక

మోదమ్ములకు వసుంధర

వేసెను ఆమోద ముద్ర;

Read the rest of this entry →

కమ్మ కమ్మని విందు

By: admin Category: పాటలు


చిలకమ్మ చిర్రు బుర్రు లాడింది
సితా కోక చిలకమ్మ రుస రుసలు
కస్సు బుస్సు మంటోంది గొరవంక
విస విసా వచ్చింది వన మయూరం

నేస్తాల చిట పటలు మాన్‌పి వేయంగా
యోచనలు చేసాయి గబ్బిలాయి, గుడ్ల గూబ;

“ అడవిలోని దోస్తులను అన్నిటినీ
విందుకు రమ్మని” పిలిచాయి.

“వివాహ భోజనంబు - వింతైన వంటకంబు “
ప్రిపరేషనులలోన తలమునకలు అయ్యాయి.

ఇది చూస్తూ గుర్రు గుర్రు మన్నది గుంట నక్క ,
అది బహు జిత్తుల మారి.
గుట్టు చప్పుడవకుండా నక్కి నక్కి వచ్చింది నక్కమ్మ,
అంతేనా!?
గుప్పెడు ఉప్పు క్షీరంలో గభాలున గుమ్మరించి
ఉప్పు చప్పుడవకుండా జారుకుంది చల్లగా!

పాలు కాస్త విరిగిపోయె!
చెవుల పిల్లి కుందేలు
“బెంబేలు పడకండ”న్నది;
క్షీరాన్ని వడ కట్టింది,
ఉడుత సాయమవ్వగా
పన్నీరు, రసగుల్లాలను
చిటికెలోన రెడీ ఆయె !
వన భోజనమ్ములొహో!
వన జంతు, పక్షి, కీటకమ్ములు
ఖుషి ఖుషిగా కానుకలిచ్చి
షడ్రుచుల విందు నారగించి
“బ్రేవ్!”మంటూ త్రేన్‌చాయి;

గుడ్ల గూబ, గబ్బిలములు
అందుకొనెను అందరి మన్ననలు, అభినందనలు.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
ద్రావిడ భాషా వర్గానికి చెందినది “ఆంధ్ర భాష”. శబ్దాలను, సవ్వడులను రెండు సార్లు ( ద్వి రుక్తి ) పలకడము తెలుగు మాటలకు ఒక అందము చేకూరుతున్నది.
గుస గుసలాడుట, కిల కిలా నవ్వుట, మిస మిస కాంతులు ……. ఇలాంటివి అన్న మాట.
బాల బాలికలారా! ఇలాంటి మరిన్ని సరదా సరదా పదాలను – సరదాగా ప్రయత్నించి సాధించండి , చూద్దాం!!!!!!
( writer : P. kadambari )