Subscribe

ముందుమాట

కథలు,  ఆటపాటలలోంచి   పిల్లలు  వికసిస్తారు.   వారి ఎదుగుదలలో కథకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  లోకం పోకడలు తెలుస్తాయి. ఊహాశక్తి,  కల్పనా సామర్ధ్యం పెరుగుతుంది.  విచక్షణ,  వ్యవహార దక్షత  అలవర్చుకుంటారు.   సాహిత్యం పై మక్కువ పెంచేది కథ.  వాక్యనిర్మాణం, పదజాలాభివృద్ది కూడా మెరుగుపడతాయి.

క్రమంగా పిల్లలు  తెలుగు కథ, ఆట పాట లకి దూరమౌతున్నారు.  వాటిని అందించాలనేదే మా లక్ష్యం. జాబిల్లి లాభాపేక్షలేని  అంతర్జాల పత్రిక.

రేపటి తరానికి తెలుగు భాష పై అనురక్తి కలిగించటానికై మా వంతు ప్రయత్నంగా ఈ చిరుదివ్వెని సమర్పిస్తున్నాం.

చిన్నారులు కథలు,  ఆటపాటలు, వ్యాసాలు,  కబుర్లు, బొమ్మలు ఇలా ఏదైనా మీ సృజనాత్మకసృష్టి ని ఇక్కడ పంచుకుంటూ తద్వారా మీ ఆలోచనలనూ, అభిప్రాయాలను, కల్పనా శక్తినీ వికసింపజేసుకోవచ్చు.

చిన్నారులేకాక పెద్దవారూ ’జాబిల్లి’ కోసం రాయవచ్చు.
భావితరానికి సాహితీప్రియులనీ, రచయితలనీ అందించాలనే మా ఆకాంక్షకి మీ అందరి ఆశిస్సులు, అభిమానం ఎంతో అవసరం వాటిని అందిస్తూ మాతో పాలు పంచుకోమని కోరుతూ…….
jabilli@teluguratna.com

మీ
’జాబిల్లి’

Leave a Reply