ఉడత వంటి స్కంక్ ఊరవతలే.  

stunk

పిల్లాలూ! మీరు  ఉడుతల్ని నిత్యం చూస్తూనే  ఉంటారుగా ! ఇంచు మించు ఉడుత ఆకారంలో ఉండే ‘స్కంక్ ‘ అనే చిన్న జంతువు గురించీ  కొంచే చెప్పు కుందామా! స్కంక్  చాలాచిత్రమైన  రీతిలో ఆత్మ రక్షణ చేసుకుంటుంది. దీని తోక దగ్గర  రెండు గ్రంధులు ఉంటాయి. వీటి నుండి ఒక రకమైన ద్రవపదార్ధం   తయా రవుతుంది . స్కంక్   శత్రువును ఎదుర్కోడం  చాలా  తమాషాగా ఉంటుంది. దీన్ని ఎవరైనా  భయ పెడితే ముందు కాళ్ళపై  నిలబడి తోకను పైకెత్తు  తుంది .శతృవు పై తుపాకీ గురి పెట్టి భయపెట్టే వీరుడిలాగా అన్న మాట. శతృవు దీనికి భయ పడనపుడు ఇది చేసే పనేంటో తెల్సా! దీని తోకదగ్గర వున్న గ్రంధులనుండి తయారయ్యే అతి ఘాటైన ,భయంకరమైన, ముక్కులు బద్దలయ్యే దుర్గంధ  పూరిత ద్రవాన్ని అమితవేగంగా శతృవుపై  చాలా దూరం వరకూ చిమ్ముతుంది .ఆ వాసనకు భయపడి ఎవ్వరూ ,మృగాలు సైతం  దానిజోలికి వెళ్ళవు.

ఈ స్కంక్ లు మాంసాహారి.ఇవి రాత్రులు తిరుగుతూ  క్రిములనూ, కీటకాలనూ,ఎలుకలనూ , ఉడతలనూ, పక్షులనూ, వాటిగ్రుడ్లనూ భుజిస్తాయి. ఇవి చెట్ల తొర్రల్లో, ఎలుకల కన్నాల్లో నివసిస్తాయి.ఆడ స్కంక్స్ 40 నుండి 70 రోజుల్లో  గర్భం ధరించి రెండు నుండి పది వరకూ పిల్లాల్ని పెడతాయి. పాలిచ్చి పెంచుతాయి. ఇవి సులువుగా  మచ్చికవుతాయి.ఇవి  అనే క   ఆ కారాలలో , రంగుల్లో వుం టా యి.చారలతో, మచ్చలతో, కూచుముక్కు తోను వుండే ఈ స్కంక్స్ 30 అంగుళాల పొడవు 12 కిలోలబరువు వుంటాయి.కొన్నింటి తోక నలుపు తెలుపు రంగుల్లో కుచ్చుగా  ఉడుత తోకలా ఉంటుంది . దీన్ని పెంచుకో దలచిన వారు ముందుగా  శస్త్ర చికిత్స ద్వారా  దీని దుర్గంధ  పూరిత గ్రంధులను తీసి వేసి, మచ్చిక చేసుకుంటారు.

ఐతే ఈ   సంక్స్  అమెరికా,కెనడా,మెక్సికో లో మత్రమే జీవిస్తాయి.వీటి దుర్గంధమే వీటికి శ్రీరమ రక్ష.

————సేకరణ–ఆదూరి.హైమవతి

 

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *