భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలామ్ గారికి జాబిల్లి పత్రిక నివాళి

వికిపిడియా నుండి :

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్  అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 – జులై 27, 2015), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త మరియు 11 వభారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998 లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్ధిగా ప్రతిపాదించబడగా , ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

బాల్య మరియు విద్యాభ్యాసం

అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలాం రామేశ్వరం, రామనాథపురం జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించాడు. తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని మరియు తల్లి ఆశిఅమ్మ, గృహిణి. పేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశాడు.

పాటశాలలో సగటు మార్కులు అయినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు మరియు ఎక్కువ సమయం కష్టపడేవాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954 లో భౌతికశాస్త్రం నందు పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ ఎత్తివేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ “కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను” ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడు.

శాస్త్రవేత్తగా

మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT – చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDOలో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు. కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద INCOSPAR కమిటీలో పనిచేశారు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1963-64 లో, NASA యొక్క లాంగ్లే రీసెర్చ్ సెంటర్ ను(హాంప్టన్ వర్జీనియా లో కలదు) మరియు గ్రీన్బెల్ట్, మేరీల్యాండ్ లోని గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మరియు తూర్పు వర్జీనియా తీరంలో కల Wallops ఫ్లైట్ సౌకర్యం సందర్శించారు. 1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి.

రాజా రామన్న కలాం ను దేశం యొక్క మొదటి అణు పరీక్ష “Smiling Budha” ను వీక్షించడానికి ఆహ్వానించారు. కలాం ఈ అణు పరీక్ష అభివృద్ధిలో కాని, పరీక్ష సైట్ తయారీలో కాని మరియు ఆయుధం రూపకల్పనలోకాని పాల్గొనలేదు.

1970 లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. విజయవంతమైన SLV కార్యక్రమం టెక్నాలజీ ఉపయోగించి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంకోసం ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వలింట్ లకు కలం డైరెక్టర్ గా పనిచేశారు. కేంద్ర కేబినెట్ అసమ్మతి ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె విచక్షణ అధికారాలు ఉపయోగించి కలామ్ నిర్దేశకత్వంలోని అంతరిక్ష ప్రాజెక్టుల కోసం రహస్యంగా నిధులు కేటాయించారు. కలాం ఈ క్లాసిఫైడ్ అంతరిక్ష ప్రాజెక్టులు యొక్క నిజమైన స్వభావం కప్పిపుచ్చడానికి యూనియన్ క్యాబినెట్ ఒప్పించటంలో సమగ్ర పాత్ర పోషించారు. కలాం పరిశోధన మరియు నాయకత్వంతో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడంతో 1980లలో ప్రభుత్వం కలాం అధ్వర్యంలో ఆధునిక క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అప్పటి రక్షణ మంత్రి, ఆర్.వెంకటరామన్ సూచనతొ కలాం మరియు డాక్టర్ విఎస్ అరుణాచలం(రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు మరియు లోహశోధకుడు) తొ కలిసి ఒకేసారి పలు వివిధ క్షిపిని అబివృద్ధికి రూపకల్పన చేశారు. ఆర్ వెంకటరామన్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనే కార్యక్రమం కోసం 388 కోట్లు కేటాయించి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా కలాంను నియమించారు. కలాం, మధ్యంతర శ్రేణి ప్రాక్షేపిక క్షిపణి అగ్ని మరియు వ్యూహాత్మక ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి పృధ్వి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు.

జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శి గా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు. అబివృద్ది దశలో R చిదంబరం పాటు ప్రాజెక్ట్ సమన్వయకర్త గా పనిచేశారు. అణుపరిక్షల సమయంలో మీడియా తీసిన ఫొటోలతొ దేశంలోని అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త కలాం ప్రజలలో ప్రాముఖ్యం పొందారు.

1998 లో, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజు పాటు, కలిసి కలాం తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ కలాం-రాజు స్టెంట్ ను అభివృద్ధి చేశారు. 2012 లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం -రాజు టాబ్లెట్ అనబడే టాబ్లెట్ PC రూపొందించారు.

INS సింధురక్షక్ జలఅంతర్గామిపై కలాం

పురస్కారాలు

సంవత్సరం పురస్కారం అందచేసినవారు
2014 సైన్స్ డాక్టరేట్ ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK[2]
2012 గౌరవ డాక్టరేట్ సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం[3]
2011 IEEE గౌరవ సభ్యత్వం IEEE[4]
2010 ఇంజనీరింగ్ డాక్టర్ వాటర్లూ విశ్వవిద్యాలయం[5]
2009 గౌరవ డాక్టరేట్ ఓక్లాండ్ యూనివర్శిటీ[6]
2009 హూవర్ పతకం ASME ఫౌండేషన్, USA[7]
2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA[8]
2008 ఇంజనీరింగ్ డాక్టర్ నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్[9]
2007 కింగ్ చార్లెస్ II పతకం రాయల్ సొసైటీ, UK[10][11][12]
2007 సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK[13]
2000 రామానుజన్ అవార్డు ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై [14]
1998 వీర్ సావర్కర్ అవార్డు భారత ప్రభుత్వం
1997 నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్
1997 భారతరత్న భారత ప్రభుత్వం[14][15]
1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం)[16]
1990 పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం[14][17]
1981 పద్మ భూషణ్ భారత ప్రభుత్వం[14][17]

ఇతరాలు

 • “ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. ‘మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి’
 • ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. ‘ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా’ అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు’ అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. ‘ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను’ అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు 3.8.2008)
 • ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958 లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగు లో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962 లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రో కు మారారు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది. 1982 లో, ఆయన DRDO కు డైరెక్టరు గా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు “మిస్సైల్ మాన్” అని పేరు వచ్చింది. జూలై 1992 లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికిసాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998 లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.
 • భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్(1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో(90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి వామపక్షవాదులు తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
 • కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. “ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు” అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్ తో బాటు, భగవద్గీత ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. మానవతావాది . వారు తిరుక్కురళ్ లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క “పాశురం ” నైనా ప్రస్తావిస్తారు.
 • కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నారు. ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బయో ఇంప్లాంట్స్ (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సుసాఫ్టు వేర్ నే సమర్థిస్తారు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.

రచనలు

కలాం రచనలు

 • ఇండియా 2020 – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003) ISBN 0-14-027833-8
 • ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003) ISBN 0-14-302982-7
 • ఇండియా-మై-డ్రీం – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (Excel Books, 2004) ISBN 81-7446-350-X
 • ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004) ISBN 0-07-053154-4

జీవితచరిత్రలు

 • వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999) ISBN 81-7371-146-1
 • సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003) ISBN 81-212-0807-6
 • ఎటర్నల్ క్వెస్ట్: లైఫ్ అండ్ టైంస్ ఆఫ్ డా. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం – ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002) ISBN 81-86830-55-3
 • ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ – ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002) ISBN 81-261-1344-8
 • ఏ.పి.జె.అబ్దుల్ కలామ్: ది విజనరీ ఆఫ్ ఇండియా’ – కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002) ISBN 81-7648-380-X

మరణం

రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం.. హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆతర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు

సోర్స్ 

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *