గణితంలో “వికటకవి” లు

ఎటు నుండి చదివినా ఒకటే

పిల్లలూ ! ఇంగ్లీష్ లో పాలిండ్రోమ్స్ (palindromes) అనే పదం వినే ఉంటారు కదా!

పాలిండ్రోమ్స్ అంటే ఎటునుండి చూసినా ఒకే రకంగా ఉండే పదాలు: తెలుగులో కిటికీ, మందారదామం, వికటకవి… ఇలాంటివి. ఇంగ్లీష్ లో radar, rotator, madam, … లాంటివి. మరి సంఖ్యల్లో అలాంటివి ఉన్నాయా?

కొన్ని చెప్పండి చూద్దాం. 11; 22;… 121,131, 141…..212, 222,232,…… బోలెడన్ని… వాటికి సంబంధించిన ఒక అమరిక (pattern) కింద చూడండి.

111 = 11

112 = 121

113 = 1331

114 = 14641….

11  యొక్క 4 ఘాతం వరకు ఇలా వస్తాయి. అలాగే మరొకటి చూడండి

 

11 x 11 = 121

111 x 111 = 12321

1111 x 1111 = 1234321

11111 x 11111 = 123454321

దీనిని ఇంకా కొనసాగించ వచ్చు.

మీ తరగతి పుస్తకాల్లో ఉన్న సంఖ్యా అమరికలు (number patterns) లో నుండి గానీ, మీ సొంతంగా గానీ, ఇలాంటివి కనిపెట్టండి, మీ ఫ్రెండ్స్ ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు.

పాలిండ్రోమ్స్ ప్రధాన సంఖ్య అయినా కావచ్చు, లేదా సంయుక్త సంఖ్య అయినా కావచ్చు. మొదటి పాలిండ్రోమ్ అయ్యే ప్రధాన సంఖ్య ఏది ? 11 . అంతే కాదు రెండంకెల పాలిండ్రోమ్ ప్రధాన సంఖ్య ఇదొక్కటే. పాలిండ్రోమ్స్ కి సంబంధించి మీరేమైనా కొత్త ఆంశాలు(ధర్మాలు,సంబంధాలు) కనిపెట్టగలరేమో ప్రయత్నించండి.

_________________________________________________________________________

సేకరణ: బాడిశ హన్మంత రావు, గణితోపాధ్యాయులు,

జి.ప. ఉన్నత పాఠశాల, కాపుగల్లు, కోదాడ (మ), నల్లగొండ (జి).

ఫోన్ : 9908486615

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *