నమ్మకం

రామాపురం అనే గ్రామంలో  మాధవుడనే వాడు ఉండేవాడు. అతడికి దేవుడంటే నమ్మకం లేదు. బాగా పని చేసేవాడు.అందరి కన్నాఎక్కువ సంపాయించేవాడు. అందరికి ఎక్కువ సహాయం చేసేవాడు.అందుకని అందరు అతనిని ఇష్టపడేవారు.అనాధలకుకూడు గుడ్డ ఇవ్వడమే ముఖ్యం అనేవాడు. వికలాంగులను ఎవరైనా ఎగతాళి చేస్తే ఊరుకునేవాడు కాదు.ముసలి వాళ్ళను పెద్దవారిని గౌరవించేవాడు  పిల్లలను,వికలాంగులను,ముసలివారిని తన బండి ఎక్కించుకొని వారి గమ్యస్థానం చేర్చేవాడు. పెద్దల ఎడగౌరవంగా మెలిగేవాడు.  తనను మాధవుడు అనకుండా మానవుడు అనమనేవాడు .అలా చాలారోజులు గడిచాయి.ఇంత మంచి పనులు చేస్తున్న మాధవుని భార్యకు పురిటిలో  కంటిచూపు తగ్గింది.కొడుకుకు ఎప్పుడు అనారోగ్యమే.నాలుగు సంవత్సరాలు వచ్చినా నడిచేవాడుకాడు. కాని భార్యబిడ్డను ఎంతో ప్రేమగా చూచేవాడు.  అతని మంచి తనాన్ని చూచి మెచ్చుకోసాగారు.  అందరు అతనిని మెచ్చుకోనేసరికి కాస్త గర్వం వచ్చింది. ముందునుంచి జాతరలకు పూజలకు గుడి మరమత్తులకు ధన సహాయం చేయక పోయినా ఏటకారంగా మాట్లాడేవాడు కాదు. కాని కాస్త గర్వం వచ్చిన దగ్గర నుండి ఏటకారంగా మాట్లాడటం,దేవుడిని తూలనాడటం చేయసాగాడు. అది ఉరివారికి కష్టం కలిగించినా మంచివాడనే ఉద్దేశంతో ఊరుకోసాగారు .అది గ్రహించక మాధవుడు రెచ్చిపోసాగాడు.
మాధవుడికి బుద్దిచెప్పాలని ఉన్న ఎలాగో తెలియక ఊరకుండి పోయారు ఊరివారు. అప్పుడు ఆ ఉరి గుడిలోకి  ఒక స్వామిజీ  వచ్చాడు.ఆ స్వామిజీకి దివ్య శక్తులు ఉన్నాయి.ఆయనకు భూత, వర్తమాన,భవిష్యత్ కాలాలు  తెలుసు. అతడు దేవుని గురించి ఎన్నో విషయాలు చెప్పసాగాడు.అంతకాక తన దగ్గరకు వచ్చే భక్తుల సమస్యలకు పరిష్కారం కూడా చెప్పసాగారు. జనం తండోప తండాలుగా గుడికి రాసాగారు. ఆవిషయం మాధవుడికి తెలిసింది. దొంగ సన్యాసి జనాన్ని మోసం చేస్తున్నాడని బాధపడ్డాడు. అందరికి అదే చెప్పాడు. కాని ఎవరు అతని మాట వినలేదు. పైగా మాధవుని గురించి స్వామిజికి చెప్పారు. ఆయన అంతా గ్రహించాడు. తాను మాధవునికి దేవుని గురించి  బోధిస్తానని చెప్పాడు.  మాధవుడు మీ దగ్గరకు  రాడు అన్నారు భక్తులు. నేనే మాధవుని దగ్గరకు పోతానన్నాడు స్వామిజీ .మిమ్ము అవమానిస్తాడు అన్నారు భక్తులు.తాను చూచుకుంటానన్నాడు స్వామిజీ.భక్తులు భయపడ్డారుకాని స్వామిజీ ధైర్యం చెప్పాడు.మాధవుడికి జ్ఞానోదయం కలిగే రోజులు వచ్చాయని గ్రహించాడు స్వామిజీ.    ఇలా ఉండగా ఒకరోజు మాధవుడు ఎద్దుల బండిలో తనకు పండిన పంటను పట్నంలో అమ్మడానికి   పట్నం బయలు దేరాడు.కొంతదూరం వెళ్లేసరికి స్వామిజీ కలిశాడు.ఆయన నడవలేక నడుస్తున్నట్లు,ఆయాస పడుతున్నట్లు అనిపించింది .మాధవుడు బండి ఎక్కమన్నాడు. స్వామిజీ బండి ఎక్కాడు. మాధవుడు మాట కలిపాడు. మీకు ఏవో దివ్య శక్తులు ఉన్నాయిటకదా !ఎందుకు ఇలా ఆయాస పడుతున్నారు.ఏవి స్వంతానికి వాడుకోకూడదు    ఇతరుల కష్టానికి వాడాలి అన్నాడు స్వామిజీ. అప్పడు మాధవుడు మనం సంపాదించింది మనం వాడుకోకూడదు  మనం పండించే పంట మనం వాడుకోకూడడు అంతేనా  అని ప్రశ్నించాడు .స్వామిజీ నవ్వుతు వాడుకోకుడదని కాదు నాయనా దేవుడు మనలను ఎంతవాడుకోమంటే అంటే వాడుకోవాలి అన్నాడు.మాధవుడు పకపకా నవ్వుతూ దేవుడు మనకు కనిపించుతాడా ఎంతవాడుకోవాలో చెబుతాడా అని అడిగాడు. ఇలా మాట్లాడుకుంటూ పట్నం వరకు వచ్చారు.అయినా మాధవుని మనసు మార్చ లేకపోయాడు స్వామిజీ. చివరకు స్వామిజీ దేవుడు ఉన్నాడని  రుజువు చేస్తే  ఇకపై
దేవుని నిందించకుండా ఉంటావా  దేవునిపై నమ్మకం ఉంచుతావా అని అడిగాడు. అలాగే అన్నాడు మాధవుడు.అప్పుడు స్వామిజీ
ఇప్పుడు   నివు నీకు సంభందించి ఒక చేడుకోరుకో .అది  నిజం అవుతుంది. దేవునిపై భారం వుంచి ఇంటికి వెళ్ళు ఆ చెడు నీకు మంచిగా మారుతుంది అన్నాడు. అయన మాటలు నమ్మని మాధవుడు  దేవుని మహిమ నాకు అక్కరలేదు అయినా మీకు దివ్య శక్తులు లేవని నిరూపించడానికి చేడుకోరు కుంటాను.అది నిజమైతే దేవుని నమ్మి మంచి కోరుకుంటాను అంటూ  నా లక్ష్మి ,నాప్రాణం పోయినంతపని కావాలి అని కోరుకున్నాడు తధాస్తు అని  వెళ్లి పోయాడు  స్వామిజీ. పంట అమ్మాడు .చేతినిండా డబ్బు పట్టుకుని
మురిసి పోయాడు.తాను అనుకున్న చెడు జరగలేదని స్వామీజీ ఉట్టి దొంగ సన్యాసి అనుకుని తన ఊరికి బయలుదేరబోతుండగా
తన నౌకరు హడావుడిగా రావడం గమనించాడు.ఎదురువెళ్ళి సంగతి ఏమని అడగగా అమ్మగారు బాబును ఎత్తుకుని మేడపై నుంచి దిగుతూ జారి పడి పోయింది .దెబ్బలు బాగా తగిలి తల్లి బిడ్డ మరణించారు అని చెప్పాడు .మాధవునికి నిజంగా ప్రాణం పోయినంత పని అయ్యింది .పెద్దగా ఏడుస్తూ నాయింటి లక్ష్మి నాభార్య, నాప్రాణం నాకొడుకు మరణించారు అని క్రింద పడి దొర్ల సాగాడు. అప్పుడు మరలా స్వామీజీ వచ్చాడు .నాయనా మాధవా లే ఉరడిల్లు.భగవంతుని నమ్ముకొని ఇంటికి వెళ్ళు నీకు మంచే జరుగుతుంది అన్నాడు. మాధవుడు ఏడుస్తూనే స్వామీజీ కాళ్ళకు దండం పెట్టి భగవంతుని స్మరిస్తూ స్వామిజిని తీసుకుని  తన ఊరికి బయలు దేరాడు.తన ఇంటికి వెళ్లేసరికి ఇంటినిండా జనం ఉన్నారు. ఒక్కసారిగా భయం వేసింది.భగవంతుడా నా భార్యా బిడ్డకు ఏమికాకూడదు అంటూ ఇంట్లోకి వెళ్లేసరికి కొడుకు పరిగెత్తుతున్నాడు. భర్తను చూచి భార్య ఏమండి నాకు కళ్ళు బాగాకనిపి స్తున్నాయండి అంటూ ఎదురుగా  దగ్గరకు వచ్చింది.మాధవుడు తన కళ్ళను తానె నమ్మలేక పోయాడు. ఇదంతా స్వామీజీ మహిమ అనుకుని ఆమాటే ఆయనతో అన్నాడు. అందుకు స్వామీజీ ఇది  నా మహిమ కాదు.నివు భగవంతుడిపై పెట్టిన నమ్మకం అన్నాడు. అప్పటినుండి  మాధవుడు పేద సాదాలకే  కాకుండా గుడులకు గోపురాలకు జాతరలకు కూడా  ధనసహాయం ,సహకారం చేస్తూ సుఖంగా జీవించసాగాడు.
                                                                                                  – తెలుగు బుక్ అఫ్ రికార్డ్ ,వండర్ బుక్ అఫ్ రికార్డ్ గ్రహిత
                                                                                                                         రచన గాన శిరోమణి
                                                                                                      శ్రీమతి  పి .పద్మావతి శర్మ .ఎం .ఎ  .తెలుగు పండిట్

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *