నాన్న

చూడండి మిస్టర్ మీ నాన్నగారిని అది ఈ సమయంలో……?, మీ సమస్య నేను అర్ధం చేసుకోగలను కాని ఒక డాక్టరుగా మీరు ఆ విధంగా చేయడానికి నేను ఏ మాత్రం ఒప్పుకోను.

నా స్థానంలో ఉండి ఆలోచించండి, నేను ఇప్పుడు చెయ్యలేకపోతే మళ్ళి ఎప్పుడూ చెయ్యలేను. మరోక్కసారి డాక్టర్ నీలిమగారు..

అవును ఒక డాక్టరుగా ఆలోచించి చెబుతున్న నేను ఇటువంటివి ఒప్పుకోలేను, మీరింక వెళ్ళవచ్చు నేను మిగత పెషెంట్స్ గురించి రౌండ్స్ కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు తను ఏ పెషెంట్ గురించి అయితే గొడవపడిందో ఆ పెషెంట్ అక్కడ లేడు. వాకబు చేస్తే తీసుకువెళ్ళిపోయారని తెలిసింది. అసలు అలా జరుగుతుంది తను ఊహించలేదు. ఏమి చెయ్యాలో తెలియక అటు ఇటు బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయింది.

* * * * * * * * *

నాన్న ఇదే కద మీరు చిన్నప్పుడు చదువుకున్న బడి.

ఒక్కసారి పరిశీలించి అవును రాము ఇదే ఎన్నాళ్ళయిందో చూసి అసలు జ్ణప్తికి తెచ్చుకోలేకపోయాను, చాల మారిపోయింది. ఇంతకుముందు చుట్టుపక్కల చాల ఖాళి స్థలం ,చుట్టూ చెట్లు ఉండేవి, మీ అమ్మను మొదటిసారి చూసింది ఇక్కడేరా.

నిజమా నాన్న ?. మీది అమ్మది ప్రేమ వివాహం అని తెలుసుగాని అది ఇక్కడ నుండే మొదలయిందని తెలియదు అయిన అమ్మను ఎలా ఒప్పిచారు.

మీ అమ్మ ఎప్పుడూ పిల్లని అంటిపెట్టుకున్న తల్లి కోతిలా మీ తాత చుట్టూ తిరుగుతూ ఉండేది. బడిలో ఉన్నప్పుడు మీ అమ్మతో మాట్లాడటం కష్టంగా,ఎందుకంటే మీ తాత బడిలో ప్రధానోపాధ్యాయుడు అందులో ముక్కోపి. బడి మొత్తానికి ఆయనంటే హడల్.

తాత ముక్కోపిగాని చాల మంచోడు నన్నుబాగ ముద్దు చేశాడు. మరి అమ్మను ఎలా ఒప్పించారు నాన్న?

అదా కాలేజిలో చేరినప్పుడు. అప్పుడు మీ అమ్మ బస్ లో కాలేజికి వచ్చేది రెండు జడలు వేసుకోని, అప్పట్లో రెండు జడలు బాగ ఫ్యాషన్……( మధ్యలో నేను కల్పించుకుని)

మీరు, అమ్మ చదివింది రంగరాయ ఇంటర్మీడియట్ కాలేజి కద నాన్న, పద ఆ కాలేజికి వెళదామన్న. ఆయన కూడ సరేనని సమాధానం ఇచ్చారు. సరిగ్గా 15 నిమిషాలలో రంగరాయ ఇంటర్మీడియట్ కాలేజి ముందు ఉన్నాము. కాలేజిని చూడగానే నాన్న ఒక్కసారిగా కుర్రాడిలా మారిపోయారు. సరిగ్గా అప్పుడే …… ఏర భధ్రం ఎలా ఉన్నావు అన్నపిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే నాన్నకు కాలేజిలో ప్రాణ స్నేహితుడు, ప్రస్తుత రంగరాయ ప్రిన్సిపాల్ రాంబాబుగారు ఉన్నారు.

ఏరా ఎలా ఉన్నవ్, ఎన్ని సంవత్సరాలయింది నిన్ను చూసి పిల్లలంతా ఎలా ఉన్నారు, అయిన మేము వస్తున్నామని నీకు ఎలా తెలుసు? అని అన్నారు నాన్న.

రాము చెప్పాడు,నువ్వు ఎలా ఉన్నావ్, నీ ఆరోగ్యం సంగతి ఏమిటి… ఇలా మొదలైన వాళ్ళ మాటలు ఎక్కడ ఆగలేదు. మా అమ్మకి పుస్తకలో ప్రేమలేఖ పెట్టి తన ప్రేమను చెప్పిన దగ్గర నుండి పెద్దలను ఎదిరించి మా అమ్మను ఎలా వివాహం చేసుకుని, జీవితంలో ఎలా పైకి వచ్చింది అంతా పూసగుచ్చినట్లు చెప్పారు రాంబాబుగారు.

రాంబాబుగారు మా నాన్నగారి గురించి చెబుతూవుంటే అమ్మను ఎంత ప్రేమించారో అర్థంమైంది. రాంబాబుగారి దగ్గర సెలవు తీసుకోని వెళ్ళబోతుంటే, నాన్న జాగ్రత్త బాబు మీ అమ్మ చనిపోయిన దగ్గర నుండి అతని ఆరోగ్యం క్షీణించింది అని చెవిలో నెమ్మదిగా చెప్పారు. కొంత దూరం కారులో ప్రయాణం తరువాత ఒక సినిమా ధియేటర్ దగ్గరకు తీసుకోని వెళ్ళాను.ఆ ధియేటర్ చూడగానే నాన్నఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 

పద నాన్న నీకి ష్టమైన సినిమా మాయబజార్ అది కూడ రంగులలో అన్నా, తెగ సంబరిపడిపోతు సినిమా చూస్తూ,ఆద్యంతం ఆశ్వాదించారు. సినిమా మధ్యలో చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడ తిన్నారు, చాక్లెట్స్ అంటే నాన్నకు చాల ఇష్టం నేను కూడ కాదనలేకపోయాను. ఆ రోజు సాయంత్రం నాన్నను తీసుకోని బాలాజి గుడికి వెళ్ళాను,ఆ గుడి అంటె నాన్నకు బాగ సెంటిమెంట్ .ప్రతి శనివారం నాన్నఈ గుడికి తప్పకుండా వస్తారు, పంతులుగారితో సహ నాన్నకి చాల మంది స్నేహితులు ఉన్నారు అందరిని పలకరించుకుంటూ ఆ రోజు సాయంత్రం అంతా గుడిలో గడిపాము.

* * * * * * * * *

సరిగ్గా ఒక వారం తరువాత, సమయం ఉదయం 6.00

డాక్టర్ నీలిమ అప్పుడే అత్యవసర చికిత్స గది(ఇంగ్లీష్ల లో I.C.U అంటారు) వస్తూ,క్షమించండి మిస్టర్ రాము మీ నాన్నగారిని కాపాడలేకపోయాను. ఒక వారంలో చనిపోతారు అని తెలిసి కూడ చివరి రోజులలో ఆయనను ఆనందంగా ఉంచడానికి మీరు చాలా కష్టపడ్డారు. కాని కాలానికి కన్ను కుట్టినట్లుంది అందుకే ఆయనను తీసుకోని వెళ్ళిపోయింది, నన్ను మరొకసారి క్షమించండి మిమ్మల్ని అర్థం చేసుకోనందుకు అని చెప్పి వెళ్ళిపోయింది.

నేను మాత్రం మౌనంగా రోదిస్తూ ఉండిపోయాను.

వ్రాసినవారు:   మణికుమార్

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

One thought on “నాన్న

 • May 17, 2017 at 10:05 pm
  Permalink

  నేను వ్రాసిన ఒక కవిత ను పంపిస్తున్నాను ఆమోదయోగ్యమైన చొ జాబిల్లి లో పోస్ట్ చేయ కలరు ,

  అమ్మ కు ప్రేమతో
  ఈ అనంత విశ్వం
  ఆవిర్భవించినప్పుడు
  మానవుని ఉనికి
  ప్రారంభమైనప్పుడు
  సైగలతోనే పరిచయాలు
  జరుగుతున్నప్పుడు
  భగవంతుడు రకరకాల
  భాషలను అందించినప్పుడు
  లెక్క లేనన్ని వివిధ అర్దాల
  పదాలు జన్మించినప్పుడు
  అప్పుడు జరిగింది
  మనస్సును పులకింప చేసే వేల కట్టలేని అందమైన ఈ పదాల పుట్టుక
  “అమ్మ” “ప్రేమ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *