అందమైన అనుభూతులు

 

అమ్మపొత్తిళ్ళలో ఒత్తిగిల్లి, పవళి౦చిన రోజులు,
అమ్మప్రేమను కమ్మగా ప్రతిఫలించిన క్షణాలు,
అవన్నీఅమరాలే, అతి మధురాలే.
నాన్నఎదపై పరవశించిన పోజులు,
నాన్నరక్షణలో పరిమళించిన మోజులు,
అనుక్షణం స్మరణీయాలే, అనుసరణీయాలే.
చెలిమికిరూపం అమ్మగా, కలిమికిరూపం నాన్నగా,
అమ్మేమేలిమిగా, నాన్నేబలిమిగా 
భావించి, జీవించిన చిన్ననాటి గుర్తులు, 
ఎదలో ఇప్పటికీ నిలచిన అమ్మానాన్నల మూర్తులు,
అవన్నీ అవధిలేని అనుభూతులే,
సాటిలేని స్పందనల సానుభూతులే.

                  భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. 

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

One thought on “అందమైన అనుభూతులు

 • June 25, 2016 at 11:27 am
  Permalink

  good quotations, i am sharing in face book also. very nice articles and nice website. Keep sharing. Thanks for post.
  today telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *