పిచ్చుక సాయం | ఆదూరి .హైమావతి

అనగా అనగా ఒక ఊర్లో ఒక రైతు ఇంట్లోని వసారాలో ఒక పిచ్చుక చిన్న గూడు కట్టుకుని
నివసించేది. దానికి ముచ్చటగా ముగ్గురు పిల్లలు పుట్టాయి . వాటినలా గూట్లో వదిలేసి , తన తిండి
కోసం వెళ్ళను బాధ పడింది. వాటికేదైనా ప్రమాదం జరిగుతుందని ఆతల్లి భయం .

రైతు పిల్లలతో ఉన్నఆ తల్లి పిచ్చుకను చూసి ,ఆ పిల్ల పిచ్చుకల కోసం రోజూ కొద్దిగా ధాన్యం
వసారా లోని ఒక గిన్నెలో వేసే వాడు. మరొక గిన్నెలో నీరుకూడా పోసేవాడు. రైతు మంచి తనానికి
తల్లి పిచ్చుక ఎంతో సంతోషించింది. రోజూ రైతు వేసే గింజలను తింటూ పిల్ల పిచ్చుకలు పెద్దవి కాసా
గాయి. తల్లి పిచ్చుక ఇప్పుడు నిర్భయంగా వాటిని వదిలేసి ఆహారం కోసం వేటకెళ్ళి ఎక్కడి నుంచో
చిన్న చిన్న కీటకాల ను ఏరి ముక్కుతో తెచ్చి బిడ్డలకు పెట్టసాగింది.అవి తింటూ పిల్లపిచ్చుకలు
బాగా ఎదిగాయి.

ఒక రోజున తల్లి వాటిని బయటికి తీసుకెళ్ళి పరిసరాలు చూపింది. “ ఇవి పళ్లచెట్లు, ఇది నీళ్ల
మడుగు, ఇది మన మంచి రైతు పొలం ,ఇక్కడ మాత్రం గింజలు తిని మన రైతుకు ఏమాత్రం నష్టం
కలిగించ కూడదు.” అంటూ అన్నీ చెప్పింది.

రైతు పొలం ఏపుగా పెరిగింది . ఐతే దురడృష్ట వశాత్తూ చీడ పట్టు కుని పంట పొలం పాడవ
సాగింది. రైతు విచారంగా ఉండటం గమనించిన తల్లి పిచ్చుక, పిల్ల పిచ్చు కలతో మాట్లాడింది. రేపు

ఏమి చేయాలో చెప్పింది . తెల్లారగానే పిచ్చుకల కుటుంబం వెళ్ళి తన బంధు మిత్రులనంతా విందు
కు ఆహ్వానించాయి. అంతా కలిసి రైతు పొలం మీది చీడ పీడ కీటకాలనంతా భక్షించి చక్కని విందు
చేసుకుని వెళ్ళాయి.

వెళ్ళేప్పుడు తల్లి పిచ్చుక వారందరికీ చెప్పింది”మిత్రులారా! ఇది మారైతన్న పొలం . దీన్లో
గింజలను మాత్రం ఏరితిని రైతుకు హాని కలిగించకండి కీటకాలను మాత్రమే విదారగించండి “అని
చెప్పి పంపింది.

రైతు పొలానికి వచ్చి చూసే సరికి పొలం నిండుగా పిచ్చుకలు ఉండటం, కొద్ది సేపట్లోకే అన్నీ గుంపు
లు గుంపులుగా ఎగిరి వెళ్ళిపోడం చూశాడు. పొలంలో ఒక్క పురుగూ లేకపోడం చూసి రైతు ఆశ్చర్య
పడ్డాడు. పిచ్చుకలు చేసిన మేలు అర్ధమైంది . అతడు కృతఙ్ఞతా పూర్వకంగా పిచ్చుకల కన్నింటికీ
చేయెత్తి నమస్కరించాడు. చిన్నప్రాణులైనా వాటికున్న సహృదయానికి రైతు మనస్సు ఆనందంతో
నిండిపోయింది.

నీతి- ఎవరికైనా ఏసహాయం చేసినా మనకు తప్పక మేలు జరుగుతుంది.

************ రచన- ఆదూరి .హైమావతి

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

One thought on “పిచ్చుక సాయం | ఆదూరి .హైమావతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *