స్నేహం
స్నేహం రచన : మౌని, చింటు
ఒక సింహానికి నదిఒడ్డుకు వెళ్ళి షికారు చెయ్యాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి పచార్లు చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండాగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళల్లో నుండి పైకెగురుతూ కిందికి పడడం చూసి దానిని భలే ముచ్చటెసింది.
. చాలా సేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సిహం ‘నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును. డాల్ఫిన్ తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది?’ అనుకొంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్ కు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరేనంది. ఆ తరువాత చాలా సేపు అవి కబుర్లు చెప్పుకొన్నాయి.
ఇంతలో సింహం పైకి ఓ అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రగా పోరాడింది. కాని, నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సయం చేయమని డాల్ఫిన్ను కోరింది. ‘నేను నీటిలో ఏమైనా చేయగలను. నేలమీదకు వస్తే అశక్తురాలినీ అని చెప్పి చూస్తూ ఉండిపోయింది. అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న అఖరికి అలసి తన దారిన తాను వెళ్ళిపోయింది.
అప్పుడు డాల్ఫిన్ ‘మిత్రమా… నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానిని అర్థమేమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండటానికి తగను ‘ అని బాధపడింది. అప్పుడు సింహం ‘నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదయినా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి. నీటిలో కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికి స్నేహితులుగానే ఉందాం. అని చెప్పి అక్కడినుండి వెళ్లిపోయింది .

it’s really a nice story.
1