Subscribe

Archive for September, 2009

చిటికెల పందిరి

September 25, 2009 By: Category: పాటలు

697931_starfeild

రచన ; కుసుమ కుమారి

చిటి చిటి జాబిలి చిటికెలు వేసెను
చుక్కలు వచ్చి,నింగిని చేరెను
నీలాంబరము తారల కొలువయె!

జాబిలి వెన్నెల చప్పట్లు చరిచెను
నక్షత్రాలు కొలువు దీరి – మరీ
మిణుగురు కాంతుల చిటికెలు వేసెను

వెన్నెల తీరులు శత కోటి
రాతిరి కాంతుల చలువ పందిరి
పిన్నలు,పెద్దల ఆటల సందడి, ఉరవడి

జారు! జారు!జల పాతాలు !

September 13, 2009 By: Category: పాటలు

Salto Del Angel

రచన;కాదంబరి

జారు! జారు!జల పాతాలు !
ఎత్తిపోతల జల పాతాలు :
వంశ ధార నది,పంచ ధారల,
కుంతల వాటర్ ఫాల్సు,ఓహో!

జారే జారే జల పాతాలలొ
సిరి వెన్నియల*1జల తారు పోగులు!

తూర్పు కొండల దిన మణి పింఛము!
జల ధారలలో హరివిల్లు లొహో!

జల పాతాలలొ సంతోషాల స్నానాలు!
ధార ధారనూ అల్లు కున్నవీ
పిన్నల,పెద్దల కోలాహలాలు,
“నవ్వు,కేరింతల”ఒప్పుల కుప్పలు

*************************************************

(*1సిరి వెన్నియలు=సిరి వెన్నెలలు)