చిటికెల పందిరి
రచన ; కుసుమ కుమారి
చిటి చిటి జాబిలి చిటికెలు వేసెను
చుక్కలు వచ్చి,నింగిని చేరెను
నీలాంబరము తారల కొలువయె!
జాబిలి వెన్నెల చప్పట్లు చరిచెను
నక్షత్రాలు కొలువు దీరి – మరీ
మిణుగురు కాంతుల చిటికెలు వేసెను
వెన్నెల తీరులు శత కోటి
రాతిరి కాంతుల చలువ పందిరి
పిన్నలు,పెద్దల ఆటల సందడి, ఉరవడి
రాతిరి కాంతుల చలువ పందిరి
పిన్నలు,పెద్దల ఆటల సందడి, ఉరవడి
