స్నేహం
స్నేహం
రచన ; వైష్ణవి (Vaishnavi, 8th class, Tirupati)
బన్నీ, సిద్ధూ, అభి, నందు నలుగురు స్నేహితులు. వాళ్ళు నలుగురు ఒకే బడి లో చదువుకునేవారు. ఒకసారి సిద్ధూ బడికి రాలేదు ఆ రోజు అనుకోకుండా స్కూలు కి మూడురోజులు సెలవులు ఇచ్చారు. బుధవారం, గురువారం, శుక్రవారం సెలవులు .
శుక్రవారం సిద్ధూ పుట్టినరోజు వుంది. సిద్దు తన స్నే
హితులను పిలుచుకొని రావటానికి వెళతాను అన్నాడు.
సిద్ధూ వాళ్ళ నాన్నగారు డ్రైవర్ తో సిద్ధూ స్నేహితుల అడ్రెస్ చెప్పి పంపించాడు. బన్నీ వాళ్ళ ఇల్లు సిద్ధూ ఇంటికి చాలా దగ్గరే కాబట్టి మొదట బన్నీ ఇంటికి వెళ్ళారు. సాయంత్రం పుట్టిన రోజుకి రమ్మని చెప్పారు. అభి, నందు వాళ్ళ దగ్గరకి వెళుతున్నామని చెప్పగానే బన్నీ కుడా వాళ్ళతో కలిసి బయల్దేరాడు.
అభి, నందు వాళ్ళు వుండే అపార్ట్ మెంట్ కొంచెం దూరం. వీళ్ళు వెళ్ళేసరికి అభి బయట ఆడుకుంటూ కనిపించాడు. బన్నీ, సిద్ధూ అభి వద్దకెళ్ళి పుట్టిన రోజు గురించి చెప్పి, ఐదవ అంతస్తు లోని నందు ఇంటికి వెళ్లాలని అందరు లిఫ్ట్ వద్దకు వెళ్ళారు. అక్కడ వాచ్ మెన్ వీళ్ళను చూసి ఎవరింటికి వెళ్ళాలి అని అడిగాడు. సిద్ధూ చెప్పిన నంబర్ విని వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్లిపోయారు, అని చెప్పాడు వాచ్ మెన్.
తరువాత అందరు అభి ఇంటికి వెళ్ళారు. అభి వాళ్ళ అమ్మ అభిని ఇప్పుడే మీతో పాటు తీసుకు వెళ్ళండి వాళ్ళ నాన్న రావాలంటే చాలా ఆలస్యం అవుతుంది అంది. అభి ముస్తాబు అయి సిద్ధూ బన్నీ తో కలిసి వెళ్ళాడు.
నందు వాళ్ళ అమ్మ, నాన్న బయటకు పోయారు కాని నందు ఇంట్లోనే వున్నాడు. వాళ్ళు వచ్చాక నందు ఆడుకోవటానికి అభి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అభి వాళ్ళ అమ్మ అభి సిద్ధూ పుట్టినరోజుకి వెళ్ళాడని చెప్పింది. అప్పుడు నందు కి చాలా ఏడుపు వచ్చింది. నన్ను పిలవకుండా అందరు పుట్టినరోజు చేసుకున్నారు వీళ్ళు నా స్నేహితులు కాదు అని అనుకున్నాడు. సిద్ధూ పై కోపం వచ్చింది. ఇంకముందు ఎప్పుడు సిద్ధు తో మాట్లాడను అనుకున్నాడు.
మర్నాడు బడికి వెళ్ళగానే సిద్ధూ నందు దగ్గరకి వెళ్లి చాక్లెట్స్, బొమ్మలు ఇచ్చాడు. నందు మాట్లాడకుండా వున్నాడు అప్పుడు సిద్ధు సారీ చెప్పాడు.
నువ్వు ఇంట్లో లేవని వాచ్ మెన్ చేప్పినందువల్ల ఇది జరిగింది. నువ్వు లేకపోతె మాకు కూడా బాగాలేదు అన్నాడు. అప్పుడు నందు జరిగింది తెలుసుకున్నాడు. తిరిగి నలుగురు స్నేహంగా వున్నారు.
Vaishnavi, 8th class, Tirupati.
Nice to see children being given opportunity to write stories and publish. Usually people consider children as potential readers but not as writers.
1It is good to have child writers.
2the story is good … the narration is not that good…
3