Subscribe

ఉరుముడు పువ్వు కథ

March 11, 2010 By: జాబిల్లి Category: కథలు, మీకు తెలుసా

 

రచన : N.Raveender

 

 

బాలలూ !  మీరెప్పుడైనా  ఉరుముడు పువ్వును చూసారా ? ఆకాశం ఉరిమిన వెంటనే మొగ్గలా ముడుచుకున్న ఈ పువ్వు పూర్తిగా తన రేకుల్ని విచ్చుకుంటుంది . ఎందుకలా జరుగుతుంటుంది ? దీని వెనుక ఓ కథ ఉంది వినండి.

పూర్వం ఒకసారి ఉరుము దేవేంద్రుడి వద్ద కెళ్ళి ” దేవేంద్రా ! సూర్య కిరణాలు సోకగానే కమలం వికసిస్తుంది. చంద్ర కాంతి పడగానే కలువ విరబూస్తుంది. నల్లని  మేఘాల గుంపును చూడగానే నెమలి నాట్యం చేస్తుంది. ఇలా సూర్యుడు, చంద్రుడు, మేఘుడు కావ్యాలలో స్థానం సంపాదించుకున్నారు. కానీ నా ఉరుము శబ్దం వింటేనే అందరూ బెదరి   పోతారు. సంతోషించే వారు ఎవరూ లేరు .”అని తన భాదను చెప్పుకుంది.

అప్పుడు దేవేంద్రుడు అలోచించి ,ఉరుముకు అభయమిచ్చి ఉరుముడు పువ్వును సృష్టించాడు.

2 Comments to “ఉరుముడు పువ్వు కథ”


  1. కథ బావుంది.
    పువ్వు గురించిన విశేషం ఆసక్తికరంగా ఉంది.
    ఈ పువ్వు గురించి ఇప్పటి వరకూ వినలేదు, చూడలేదు.
    ఎక్కడ ఉంటాయి ఈ పువ్వులు?
    వీటిని ఆంగ్లంలో ఏమంటారో తెలుసా?
    ఆసక్తి రేకెత్తించినందుకు మరి ప్రశ్నలు తప్పవు కదా?
    అడిగినందుకు ఏమనుకోరు కదా?

    1


Leave a Reply