పండు లాంటి పండుగ దీపావళి
రచన : అనిల్ కుమార్ పిదూరి
దివ్య దివ్య దీపావళి
ప్రతి సారీ ఈ పండుగ
“హుషార్ పండు” నవ్యమే!
నవ నవీన పర్వమే! || -
మతాబులు తేరండీ!
మతలబులు వద్దండీ!
దండిగా సంతసాల+
బండి నెక్కుదామండీ! ||
బాణా సంచా లివి గివిగో!
కులాసాల విలాసాలు
కిల కిలలకు కాణాచిగ
ఇల్లిల్లూ మారాలి ||
~~~~~~~~~~~~~~~~~~~~~~