మేలైన బాట
రచన : కాదంబరి పిదూరి
చేమంతి, గులాబీ, మల్లిక
వసుధ ఆయె నేడు
అందాలకు వేదిక
మోదమ్ములకు వసుంధర
వేసెను ఆమోద ముద్ర;
ప్రసూనముల వికాసములు
ప్రకృతి సంతోష ఘంటిక
గాలి స్వచ్ఛతకు బాసట
జీవులకు ఊరట ;
పరిమళాల మేళా – లతొ
జగమంతా కళ కళ
శాంతి,సంతోషములకు
తలమానికము తరువులు .
పచ్చ దనములు సదా
విలసిల్ల వలెను “ ఇల”పైన
సకల లోక శ్రేయస్సు బాట – కిదే
ఇదే మంచి మాట
&&&&&&&&&&&&&&&&&&
పచ్చ దనములు సదా
విలసిల్ల వలెను “ ఇల”పైన
సకల లోక శ్రేయస్సు బాట – కిదే
ఇదే మంచి మాట
1మంచిమాట చెప్పారు.
kcubev ,
Thank you for your compliments.
( kadambari )
2