Subscribe

Archive for April, 2011

దున్నపోతులపోటీ

April 30, 2011 By: జాబిల్లి Category: featured, కథలు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

Chief Editor
Itsvizag.com

 

చాలా కాలం క్రితం ఒక రాజ్యం మీదకు మరొక రాజు దండెత్తి వచ్చాడు.అతని పేరు సనగర.ఆరాజ్యం లోని అన్ని ప్రాంతాలూ సనగరకు లొంగిపోయి దాసోహం అన్నాయి.కానీ,ఒక ప్రదేశంలోని వారు మాత్రం కొత్తరాజును ఎదిరించారు.దానితో కోపమొచ్చిన సనగర  ఆ ప్రాంతం మీదకు సైన్యాన్ని పంపి మర్యాదగా లొంగకపోతే అందరినీ హతమారుస్తానని  హెచ్చరించాడు.అక్కడి ప్రజలందరూ ఒకచోట సమావేశమై,ఏంచెయ్యాలి?ఏం చేస్తే తమ స్వాతంత్ర్యం నిలుస్తుందా అని చర్చించసాగారు.
‘మనం గనుక యుద్ధం చేస్తే ఎందరో ప్రాణాలు కోల్పోతారు, మన గ్రామాలన్నీ నేలమట్టమవుతాయి,మన కుటుంబాలన్నీ చెల్లాచెదురవుతాయి,అప్పటికీ ఎవరైనా  మిగిలిఉంటే వారు బానిసలుగా బందీలవుతారు’ అంటూ ఆలోచించసాగారు.

ఇంతలో ఒక వృద్ధుడు పైకిలేచి,‘శత్రువుతో పోరాడేందుకు మనదగ్గర పటిష్టమైన ఆయుధాలు లేవు.కాబట్టి భుజబలంతో కాక,బుద్ధిబలంతో పోరాడాలి,గెలవాలి’అంటూ చెప్పుకొచ్చాడు.
అతని మాటకు అందరూ అంగీకరించి,ఒక నిర్ణయానికి వచ్చి,తమ తరపున ప్రతినిధులుగా కొందరిని సనగర దగ్గరకు పంపించారు.ఆ ప్రతినిధులు సనగరను కలసి,‘రాజా,యుద్ధం అంటూ జరిగితే,మీవైపు,మావైపూ,ఇరుపక్షాల సైనికులూ మరణిస్తారు.పైగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.కాబట్టి, మనం దున్నపోతుల పందెం పెడదాం,మీ దున్నపోతు గెలిస్తే మేమందరం మీకు లొంగిపోతాం.మా దున్నపోతు విజయం సాధిస్తే మమ్ముల్ని స్వతంత్రులుగా ఉండనివ్వండి’అంటూ కోరారు.

(more…)

అంకెలతో చిలక జ్యోతిష్యుడు

April 11, 2011 By: జాబిల్లి Category: పాటలు

రచన ;  కాదంబరీ పిదూరి

ఒక్కొక్క వక్క; తమల పాకులలోన;
రవ్వంత సున్నం నోటి పంటలంట!
రెండు బాదం పప్పులు అడిగింది ఉడత;
మూడు జాం(మ)కాయలు కొసరింది చిలక;

“నాలుగు రూకలు రానీ!
మెండుగ పెడతా తిండి”
అన్నాడు యజమాని,
చిలక జోస్యుడు అతడు;

“ఐదు దారలు పంచదార, చక్కెరలు
ఆరు బయట ఆటలు,
ఏడు రాత్రుల కథలు;
ఎనిమిది అష్టా చమ్మ;
తొమ్మిది నవ రాత్రులు;
దశమీ నాటికి మనకు
దశ తిరుగుతుందిలే!
మనకు పట్టిందల్లా పసిడి –
ఔతుందిలే సామీ!”
అని శుకము పదముల్లు.
రా చిలక పలుకుల్లు
తేనెల ఉరవళ్ళు;
అందరు వచ్చేసారు,
చేతులు చూపించారు;
“జోస్యం మాటేదైనా,
నీ మధువుల మాటలు
లక్షల వరహాలు, కోటి దీనారాలు!
అందుకె మేం వచ్చాము;
కీర వాణి, చిలకమ్మా!”
అన్నారు అందరూ,
ముచ్చట్ల చప్పట్లు
చిలకకు బహుమతులు  ;
కిళి!కిళి! కిళి! కానుకలు