Subscribe

Archive for October, 2011

ఒక్కరు ఇద్దరవ్వాలంటే

October 30, 2011 By: జాబిల్లి Category: కథలు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

 కంచిల్ = జింక, మట్జన్ = పులి

ఒకరోజు కంచిల్ పెద్ద గోనె సంచి తీసుకుని మట్జన్ తోటలో మామిడిపళ్ల దొంగతనానికి బయలుదేరింది.తోటలోకి వెళ్ళిందో లేదో అక్కడ కోపంతో బుసలు కొడుతున్న మట్జన్ ను చూసి ఆశ్చర్యపోయింది కంచిల్.‘ఇప్పటికే చాలా మామిడిపళ్ళు మెక్కావు,దానికి బదులుగా ఇవ్వాళ నిన్ను తినేస్తాను’అంటూ విరుచుకుపడబోయింది మట్జన్.‘ఆగు,సోదరా,ఏమిటా తొందర,నేను ఉదయం నుంచి ప్రజలకు ఒక పని చేసిపెడుతున్నాను.ప్రస్తుతం రాజుగారు కూడా కావాలంటే ఆయన దగ్గరకు బయలుదేరాను ’అంది.‘పొద్దుట్నుంచి నువ్వు ఏమి చేస్తున్నావేమిటి?అంటూ మట్జన్ నిలదీసింది.

(more…)

ఇసుక తిన్నెలకు పాపిటి బిళ్ళలు

October 30, 2011 By: జాబిల్లి Category: పాటలు

రచన : కుసుమ
కొలనున తామర, కలువల్లు; 
అందాలకు విలువౌ  నెలవుల్లు ||

జలముల ఈదే నెలవంక; 
కొబ్బరిమట్టలు ఇచ్చునులే!; 
“చంద్రుని కెన్నో నూలుపోగులను ||

ఒడ్డున కులుకుతు లుకలుకలాడే 
పీతలు, నత్తలు, చిటి తాబేళ్ళు  
పరుగు పందెమున జమాజెట్టిలు ||

పిలలు కట్టిన పిచ్చుక గూళ్ళు; 
తీరములందున ఇసుక తిన్నెలకు; 
సింగారించిన పాపిటి బిళ్ళలు     ||

పెద్దల్లారా! శషభిషలెందుకు?; 
మీ ఉడుకుమోతుతనములు తొలగించి,
పిన్నలతోటి చేతులు కలిపి;   
శాంతితొ చేద్దురు సహవాసమును ||