Subscribe

ఇసుక తిన్నెలకు పాపిటి బిళ్ళలు

October 30, 2011 By: జాబిల్లి Category: పాటలు

రచన : కుసుమ
కొలనున తామర, కలువల్లు; 
అందాలకు విలువౌ  నెలవుల్లు ||

జలముల ఈదే నెలవంక; 
కొబ్బరిమట్టలు ఇచ్చునులే!; 
“చంద్రుని కెన్నో నూలుపోగులను ||

ఒడ్డున కులుకుతు లుకలుకలాడే 
పీతలు, నత్తలు, చిటి తాబేళ్ళు  
పరుగు పందెమున జమాజెట్టిలు ||

పిలలు కట్టిన పిచ్చుక గూళ్ళు; 
తీరములందున ఇసుక తిన్నెలకు; 
సింగారించిన పాపిటి బిళ్ళలు     ||

పెద్దల్లారా! శషభిషలెందుకు?; 
మీ ఉడుకుమోతుతనములు తొలగించి,
పిన్నలతోటి చేతులు కలిపి;   
శాంతితొ చేద్దురు సహవాసమును ||

Leave a Reply