యుద్ధం తప్పించిన మీసం
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
కంచిల్ నివసించే రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరవు పరిస్థితులు
ఏర్పడ్డాయి.పక్కనే ఉన్న అరణ్యంలోని పులిరాజు తనానుచరులయిన పులలందరినీ
సమావేశపరచాడు.‘ప్రజలారా,రోజురోజులూ మనకు ఆహారపు కొరత చాలా దారుణంగా
తయారవుతూ ఉంది.ఈ దుస్థితి ఇలాగే కొంతకాలం కొనసాగితే మనకు మనుగడ
కష్టమవుతుంది,ప్రజలందరకూ తిండితిప్పలు తప్పేందుకు మంచి ఉపాయం చెప్పండి’అని
కోరాడు.అప్పుడు పులిమంత్రులు,‘మహారాజా,మన పక్కనే ఉన్న రాజ్యంమీదకు
దండెత్తుదాం,దానితో మనకు ఆహారపు కొరత తీరిపోతుంది’అని సలహా ఇచ్చారు.దానితో‘సరే మీరు
వెళ్ళి మనకు లొంగిపొమ్మని,లేదా యుద్ధం తప్పదని ఆ రాజుకు చెప్పండని’తన ముగ్గురు
మంత్రులను ఆజ్ఞాపించాడు.పైగా,మహాపులిరాజు,పౌరుషానికి గుర్తుగా,తనమీసాల్లో నుంచి
బాగా లావుగా,పొడవుగా ఉన్న వెంట్రుకను పీకి,దీన్ని చూయించి మా గురించి వివరించమన్నాడు.
ముగ్గురు పులిమంత్రులూ పక్కరాజ్యం వెళ్ళారు.కనిపించిన ప్రతివారినీ ‘మీరాజు
ఎక్కడ?’అంటూ ప్రశ్నించినా ఎవరూ బదులివ్వలేదు.వాళ్ళు అలా తిరుగుతూ కంచిల్ నివసించే
ప్రాంతానికి వచ్చారు.కంచిల్ ను మామూలు జింక అనుకుని‘ఏమోయ్.మీరాజు ఎక్కడ’అంటూ
హేళనగా అడిగారు.ఎందుకంది కంచిల్.వచ్చిన పని చెప్పారు వాళ్ళు.మా రాజు గారు
వేటకెళ్ళారంది కంచిల్.మమ్ముల్ని అక్కడికి తీసుకెళ్ళమన్నారు మంత్రులు.‘అయ్యా,మీరు
చాలా దూరం నుండి వచ్చి అలసిపోయారు.మీరు ఇక్కడే ఉండండి,నేను వెళ్ళి చెప్పి వస్తా’నని
బయలుదేరివెళ్ళింది.వాళ్లు రాజు ఇచ్చిన మీసం వెంట్రుకను ఇచ్చిపంపారు
పులిమంత్రులు.అది తీసుకుని నడుస్తూ ఆలోచించసాగింది కంచిల్.పులులరాజ్యంలో
బతకటానికి,పులికి ఆహారమవటానికి పెద్ద తేడాలేదు,కాబట్టి,ఆక్రూరమృగాలకు ఏవిధంగా
బుద్ధిచెప్పిపంపాలా అని అనుకుంటూ నడుస్తుండగా అంటన్ అనే ముళ్ళపంది
ఎదురొచ్చింది.అంటన్ ను చూసిన వెంటనే కంచిల్ కు మంచి ఉపాయమొకటి తట్టింది.
‘సోదరా,మంచి ముల్లు ఒకటి పీకి ఇవ్వు ’అని అడిగి తీసుకుని పులిమంత్రుల దగ్గరికి
వెళ్ళింది.కంచిల్ ను చూసి‘ఏమన్నాడోయ్,మీరాజు’అని అడిగారు పులిమంత్రులు.‘అయ్యా,నేను
వెళ్ళేసరికి మా మహారాజుగారు వేటకెళ్ళి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.ఇద్దరు సేవకులు
రెండు పర్వతాలను తీసుకుని వాటితో ఆయన కాళ్ళను మర్ధన చేసున్నారు.రాజుగారికి మీరు
చెప్పిందంతా అక్షరం పొల్లుపోకుండా వివరించాను.ఆయన కోపంతో ఇంతెత్తున
ఎగిరిపడ్డాడు.”మేము కూడా యుద్ధాలు చేసి చాలాకాలమయ్యింది,అంతా ప్రశాంతంగా
ఉండటం వల్ల మాకూ విసుగ్గా ఉంది.యుద్ధానికి మేము సిద్ధమే,ఇదిగో, నాపరాక్రమానికి
చిహ్నంగా తన మీసంలో వెంట్రుకను పీకి , మీకు ఇమ్మన్నారని అంటూ ముళ్ళపంది
ముల్లును మంత్రుల చేతిలో పెట్టింది.
తమరాజు గారిమీసం కంటే వందరెట్లు పొడవు,లావు ఉన్న వెంట్రుకను చూసి
పులిమంత్రులకు గుండెలు చెరువులయ్యాయి.బతుకుజీవుడా అనుకుంటూ తమరాజు దగ్గరకు
పరుగుతీసాయి.పులిమహారాజుతో విషయం మొత్తం చెప్పాయి.రాజుకూడా భయంతో నిలువునా
కరిగి నీరయ్యాడు.అయితే,ప్రభువులు ప్రాణం పోతున్నా బింకాన్ని వదలరు కాబట్టి,‘మీరు
వెళ్ళాక ఆలోచించానయ్యా,యుద్ధం చెయ్యటం కంటే మనప్రజానీకం మీద ఎక్కువపన్నులు
వేద్దామంటూ గంభీరంగా మాట్లాడి ఆ విషయాన్ని గుంభనంగా
పక్కదారిపట్టించాడు.అప్పటినుంచి యుద్ధాలు చేసినా,చేయబోయి విరమించినా పన్నులు
పెరుగుతూనే ఉన్నాయి
————————————————————————————
శివ గారికి,
1ముందుగా అభినందనలు. జాబిల్లి బాగుంది. కొన్ని బొమ్మలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. పిల్లల పత్రిక కదా. అలాగే ఎక్కువగా విదేశీ సరుకు కాకుండా భారతీయంగా ఉంటే కొత్తగా ఉంటుందీ, ఇంట్రెస్టింగ్ గా కూడా…! శుభం…!!
-చంద్రం
http://telugujabili.blogspot.com/
చంద్రం గారు ధన్యవాదములు. భారతీయతకే మా ప్రాదాన్యత అండి. బొమ్మలు ఉంటే చాలా బావుంటుంది కాని జాబిల్లి స్వచ్చంద పత్రిక కాబట్టి బడ్జెట్ తక్కువండి. అందువల్ల ప్రొపెషనల్ చిత్రకారులతో బొమ్మలు వెయ్యించలేము అలా అని ఉచితంగా బొమ్మలు వెయ్యమని ఎవ్వరిని అడగలేము.
ముందు ముందు పరిస్తితి మారుతుందేమో చూడాలి.
అన్నట్టు మీ బ్లాగు చాలా బావుంది.
2శివ