మాగురించి
మాగురించి అనే కంటే మనగురించి అన్న మాటే సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ’జాబిల్లి’ అందరిది.
చిన్నతనంలో మామ్మలు చెప్పగా విన్న ఆ కథలే ఈ నాటి మన సాహిత్యాభిలాషకి బీజాలు. చిన్నపిల్లల్లో తెలుగుపై ఆసక్తి పెంచటానికి బాల సాహిత్యం వారికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మనదే. ఇప్పటి పిల్లలు కథలకి, ఆటపాటలకి క్రమంగా దూరమవుతున్నారు. చదువులు ఆంగ్ల మాధ్యమంలో సాగుతున్నప్పుడు తెలుగులో బాలసాహిత్యం మరింత అవసరం.
పిల్లలకి తెలుగులో కథలు కబుర్లు చెప్పండి. చిట్టిపొట్టి పాటలు నేర్పండి. ఆటలతో వాళ్ళని ఉత్సాహపర్చండి.
కథల్లోంచి, ఆటపాటల్లోంచి పిల్లలెంత వికసిస్తారో స్వయంగా గమనించండి.
రండి అందరం కలిసి చిన్నారులకోసం ఆటపాటల్ని, కథల్నీ పోగేద్దాం…
కథలు విన్నాక, చదివాక పిల్లలు ఊరుకోరు. చూస్తూ ఉండండి, వాళ్ళు కొత్త కథలు చెపుతారు. వాళ్ళ ఊహల్ని కథలుగా మలిచేలా ప్రోత్సాహించండి.
వాళ్ళు విన్న, కన్న, ఊహించిన వాటిని కథలుగా వ్యాసాలుగా ప్రాణం పోసుకోనివ్వండి. ఏదిచూసినా దానిపై చిట్తిపొట్టి వ్యాసాలు రాసేలా ప్రోత్సాహించండి. మీరూ వాళ్ళకోసం రాయండి. జాబిల్లిని వాటికి వేదిక చేసుకుందాం.

ennO rOjulanumchi eduru choostunnaamu jaabilli kOsam
1chaalaa chaalaa dhanyavaadamulu
ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్నాము జాబిల్లి కోసం
2చాలా చాలా ధన్యవాదములు
Thanq..
For running a magagine for children..
3