Subscribe

Archive for the ‘అవ్వ చెప్పిన కధలు’

ఒక్క వెంట్రుక రాణి

By: Category: అవ్వ చెప్పిన కధలు

ఒక్క వెంట్రుక రాణి


అనగనగా  ఒకరాజుకి  ఇద్దరు  భార్యలున్నారు.  పెద్ద భార్యకి  రెండు  వెంట్రుకలు  ఉన్నాయి. ఆవిడ చాలా గయ్యాలి, ఎవరితోనూ సరిగ్గా  నడచుకోదు.  రాజుగారి  చిన్న భార్యకి ఒక్కటే  వెంట్రుక ఉంది. ఈవిడ చాలా  నెమ్మది  గుణం కలది  అందరితో  స్నేహంగా  దయగా  ఉండేది.

పెద్ద  భార్యకి  తనకి  రెండు వెంట్రుకలున్నాయని  అందుకని  ఒకటే  వెంట్రుక  ఉన్న చిన్న రాణీ కంటే  తనే  అందంగా ఉన్నానని   అనుకునేది.  ఓ రోజు రాజుతో  ఒకే వెంట్రుక ఉన్న రాణి అసహ్యంగా ఉంది  ఆమెని  ఇంట్లోంచి  వెళ్ళగొట్టేయమని  చెప్పింది. దానితో   రాజు  చిన్న  రాణీని  అడవికి  పంపించేసాడు.
(more…)

ఏడు చేపలు – చెక్కిలిగిలి కథ

By: Category: అవ్వ చెప్పిన కధలు

ఏడు చేపలు  – చెక్కిలిగిలి  కథ
chepa1

అనగా  అనగా  ఒక ఊళ్ళో ఒక రాజుగారు  ఉన్నారు.  ఆయనకి  ఏడుమంది  కొడుకులు  ఉన్నారు. ఓరోజు  వాళ్ళు  వేటకి  వెళ్ళి  ఏడు చేపలు  తెచ్చారు.  వాటిని  ఎండలో  పెట్టారు.  అందరి  చేపలూ  ఎండాయి  కానీ  చివరి  అబ్బాయి  చేప  ఎండలేదు. అప్పుడు  ఆ  చిన్న  అబ్బాయి  చేపని  ఇలా  అడిగాడు.
“చేపా  చేపా  ఎందుకు ఎండలేదు?” (more…)