Subscribe

Archive for the ‘ఆటలు’

తోటల, తోపుల దోబూచి ఆటలు

November 14, 2011 By: జాబిల్లి Category: ఆటలు

చెట్టు చెట్టు కారడవి;
చెట్టుకు జట్టు చిట్టడవి;
అటవికి ఆని, ఒక తోపు
మావి తోపుల వెనుక
ఉన్నది రంగుల పూ దోట;
తోటలలోన పొదరిళ్ళు;
అక్కడ నక్కి, ఇక్కడ దాగుతు
దోబూచీ, దొంగాట;
ఆటల క్రీడల బాలుడు ఎవరు?
ఇంక ఎవ్వరు?
చిన్నారి క్రిష్ణయ్య;
చిట్టి తల్లి రాధమ్మ ;

(ఏ బాల బాలికలు ఆడుతున్నారో
ఆ పేరును ఇక్కడ చెప్తూ ఆడాలి)
- అనిల్ పిదూరి

నేను చిన్నప్పుడు ఆడిన కొన్ని ఆటలు

May 02, 2009 By: Category: ఆటలు

శివ బండారు

నేను పల్లెటూరిలో ఉండటం వల్ల చిన్నప్పుడు నా స్నేహితులతో కలసి బొలెడు  ఆటలు ఆడేవాడిని.అవి

౧. దాగుడు మూతలు : అవుట్ అయిన వాడికి దొరకకుండా దాక్కోవాలి.

౨. గూటీ బిల్ల : దీన్ని కర్ర బిల్ల అని కూడా అంటారు

౩.గోలీలాట : గోలీలతో రక రకాల ఆటలలు (more…)