Subscribe

Archive for the ‘ఒకమంచిమాట’

ఓ మంచిమాట

By: Category: ఒకమంచిమాట

చిన్న విత్తనం  మొలకెత్తి  పెద్ద  చెట్టుగా  మారేలోగా  ఎన్ని  అడ్డంకులు  అవాంతరాలు,  మొదట  విత్తనం  మట్టిలో  ఉండగానే  చీమలూ,  పురుగులూ  తినేసేయాలని  చూస్తాయి.

అది వాటిని తప్పించుకుని  మొలకెత్తుతూ   ఉంటే  పక్షులు  దాన్ని  పసిగట్టి  పొడుస్తూ  తినేయాలని  చూస్తాయి.

ఆ తరువాత  అది  పెరుగుతూ  ఉంటే  పశువులూ  దాని పని పట్టబోతాయి.

ఐనా  అది  ఎదిగి పెద్ద వృక్షంగా  మారిందంటే,  ఇంతకాలం  దాని ఎదుగుదలకు  అడ్డంకిగా ఉన్న  ఆ జీవులన్నీ  దాని  నీడలోనే  తలదాల్చుకుంటాయి.

మనిషి  ఎదుగుదలా  సరిగ్గా ఇలాంటిదే.

ఆణిముత్యాలు

By: Category: ఒకమంచిమాట

ఒక మంచి  మాట;

సంస్కారము  లేని  చదువు  వాసన లేని  పూవు  వంటిది.