కళ్యాణ్ రాఘవ
రచన ; కళ్యాణ్
కళ్యాణ్ అంటే స్కూలు లో లీడర్. అందరికంటే ఎక్కువ బలం. అందరికంటే ఎక్కువ తెలివి. అందరు ఎక్కువ పొగిడేస్తూ ఉండెసరికి కళ్యాన్ కి గర్వంగా ఉంటుంది. కళ్యాణ్ మంచి పిల్లాడే కాని గర్వంతో పొగరుమోతుగా తయారయ్యాడు.
ఆ సంవత్సరం వాళ్ళ క్లాసుకి ఓ కొత్త స్టూడెంట్ వచ్చాడు. అతడిపేరు రాఘవ. రాఘవకి చిన్నప్పుడు ఒక ప్రమాదంలో ఒక కాలు విరిగిపోయింది. స్కూలులో పిల్లలందరూ రాఘవని చూసి నవ్వుతున్నారు. కర్రలతో మెల్లిగా నడుస్తాడు రాఘవ. అందరితో కలిసి పరిగెత్తలేడు, ఆడుకోలేడు. అందరూ ఆటల పీరియ
డ్‍లొ గ్రౌండ్‍లో ఆడుతూ వుంటే రాఘవ ఒక్కడు తరగతి గదిలోనే వుంటాడు.
కళ్యాణ్‍కి రాఘవని చూస్తే చులకన. తన బలం ముందు రాఘవ ఎందుకుపనికిరాడని కళ్యాణ్‍కి తెలుసు. రాఘవ కర్రలతో నడుస్తుంటే కళ్యాణ్ వెక్కిరిస్తూ ఉంటాడు. కళ్యాన్ రాఘవని వెక్కిరించగానే పిల్లలందరూ నవ్వుతారు, అది కళ్యాణ్‍కి మజానిస్తుంది.
రాను రాను చులకన కోపంగా , అసహ్యంగా మారింది. ఇప్పుడు కళ్యాణ్‍కి రాఘవ అంటే కోపం, అసహ్యం. నేను లీడర్ గా వున్న క్లాసులో ఈ కుంటాడు లేకుంటే బావుంటుంది అనుకుంటాడు కళ్యాణ్. ఎంత వెక్కిరించినా ఏడవని రాఘవని చూస్తే కోపం ఇంకా పెరిగి పోతుంది.
ఓ సారి వాలీ బాల్ ఆడుతూ వుంటే అనుకోకుండా కిందపడిపోతాడు కళ్యాణ్. కాలికి దెబ్బ తగిలి నడవలేక పోయాడు. ఇంకా కొద్దిరోజుల్లో మ్యాచ్ వుంది, ఎలా? ఎంతో ఏడుస్తాడు కళ్యాణ్.
దెబ్బకొద్దిగా మానినాక ఓ కర్ర సాయంతో మెల్లిగా స్కూలుకి వస్తాడు. అందరూ సంతోషంగా పరిగెత్తుతూ వున్నారు నెనొక్కడినే ఇలా వున్నా అనుకుంటాడు విచారంగా.
ఆటల పీరియడ్‍లో పిల్లలందరూ గ్రౌండ్‍కి వెళ్ళిపోయారు కళ్యాణ్‍కి దిగులుగా వుంది, నాకోసం ఒక్క స్నేహితుడూ వుండకుండా అందరూ ఆటకి పోయారు అనుకున్నాడు. క్లాసులో రాఘవ వున్నాడు, కాని కళ్యాణ్‍కి అతడితో మాట్లాడాలనిపించలేదు.
ఇంకోరోజు రాఘవ పిలచినా మాట్లాడడు కళ్యాణ్.
రెండు మూడు రోజులు అయ్యాక కాలులేకపోతే ఎంత కష్టం అనేది అర్ధం అయింది కళ్యాణ్‍కి. నాకు కొద్దిరోజులకే ఎంత కష్టంగా వుంది, పాపం రాఘవ ఎప్పుడూ కాలు లేకుండా వుండాలి ఎంత కష్టం అనుకుంటాడు.
ఈ సారి క్లాసులో ఆటల పీరియడ్ లో రాఘవ మాట్లాడితే కళ్యాణ్‍కూడా మాట్లాడుతాడు. రాఘవ కళ్యాణ్‍కి స్నేహం కుదురుతుంది, రాఘవ ఎన్నో కథలు చెపుతాడు, బొమ్మలు గీయడం నేర్పుతాడు. పాటలు నేర్పుతాడు. రాఘవకి ఎన్ని తెలుసు అనుకుని ఆశ్చర్య పోతాడు కళ్యాణ్. మ్యాచ్ ఆడలేకపోయినందుకు పడే విచారం తొలగిపోతుంది.
కొద్ది రోజుల తరువాత కళ్యాణ్ కాలు గాయం పూర్తిగా

