Subscribe

Archive for the ‘పంచతంత్రం’

పంచతంత్రం — 2

By: Category: పంచతంత్రం

eluka-kaki

మిత్రలాభం ;

చిత్రగ్రీవుడు,  మిగతా  పావురాలు  వలలో చిక్కుకొనడం, హిరణ్యకుడి  సాయంతో   తప్పించుకుని   ఎగిరిపోవటం    వీటిని  గమనించిన   లఘుపతనకము  అనే  కాకి కి  మిత్రుల  వలన  కలిగే  లాభం  తెలిసింది.
హిరణ్యకుడితో   స్నేహం  చేయాలనుకొని   హిరణ్యకుడి  కలుగు  వద్దకు  వెళ్ళి  “నేను  నీతో  స్నేహం  చేయాలనుకుంటున్నాను, దయచేసి  నాతో  స్నేహం  చేయి అంటూ   కలుగులోంచి బయకు  రమ్మని  అడిగింది.

హిరణ్యకుడు  కాకి  పిలుపులకి  కలుగులోంచి   బయటకి  రాకుండా   “ఎవరు నీవు?”  అని  అడిగింది.

“నాపేరు  లఘుపతనకం,  నేను  ఒక  కాకిని.” అంది  కాకి.

 (more...)

పంచతంత్రం

By: Category: పంచతంత్రం, సీరియల్స్

పాటలిపుత్రని పాలించే రాజు సుదర్శనుడుకి ముగ్గురు కొడుకులు ఉండేవారు, చదువు సంధ్యా  లేకుండా  అల్లరి చిల్లర గా  తిరుగుతూ ఉండేవారు.
మనిషికి విద్య విజ్ఞానాన్ని,  వివేకాన్ని ఇస్తుంది   అదిలేని వాడు గుడ్డివాడి కింద లెక్క.   అన్న పండితుడి మాటలతో  రాజు  తన కొడుకుల గురించి చింతించి  ఆ విషయంగా  పండితులను పిలిచి ఎవరైనా తన కొడుకులకు చదువు నేర్పి ప్రయోజకులను చేయమని  చెప్పాడు.
విష్ణుశర్మ  అనే పండితుడు  వారిని ఆరునెలల్లో  విద్యావంతులను చేస్తానని చెప్పిన మాటలకు రాజు  సంతోషించి  విష్ణుశర్మ కి తన కొడుకులను  అప్పగించాడు.

ఆశ్రమానికి వెళ్లిన వారితో విష్ణుశర్మ  “నేను చెప్పే చదువులో పెద్ద  పెద్ద గ్రంథాలు  అక్కరలేదు   చదివే రాసే పనిలేదు.  మీకు చక్కటి కథలు చెపుతాను  అవి వింటూ లోక  జ్ఞానాన్ని నేర్చుకంటూ  వాటిలోని నీతిని గ్రహిస్తే మీరు శాస్త్రాలనన్నింటినీ చదివినట్టే.”   అంటూ ఒక పద్దతి ప్రకారం చదువు నేర్పడం మొదలుపెట్టాడు.

మంచి స్నేహితులని కలిగి ఉంటే ఆపదలలో వాళ్ళు ఆదుకుంటారు అది గ్రహించి  కాకి, తాబేలు, లేడి, ఎలుక ఆపదలనుండి గట్టెకాయి, ఆ కథల వలన మంచి మిత్రుల వలన కలిగే  లాభం ఏమిటో తెలుస్తుంది  అంటూ

విష్ణుశర్మ  మిత్రలాభం  కథలు చెప్పటం ప్రారంభించాడు.

పూర్వం  గోదావరి  ఒడ్డున  పెద్ద బూరుగు చెట్టు ఒకటి ఉండేది.  ఆ చెట్టుపై లఘుపతనకము  అనే కాకి  నివసిస్తూ  ఉండేది.  అది ఓరోజు  ఉదయాన్నే  నిద్రలేచి  తన గూడు లోంచి బయటకు వచ్చి   ఓ వేటగాడిని చూసింది.  తెల్లవారగానే  మొదట వీడి మొహం కనిపించిందే  ఈ రోజు ఏంజరుగనుందో  అనుకుంటూ  వేటగాడినే  గమనించసాగింది  కాకి.   వాడు చెట్టు పక్కనే వల పరచి దానిపై  నూకలు జల్లి  ఓ పొదలో దాక్కుని ఉన్నాడు.

చిత్రగ్రీవుడు  అనే పావురం  మిగతా తోటి  పావురాలతో కలిసి అప్పుడే అటుగా ఎగురుకుంటూ  వచ్చి  కింద నేలపై ఉన్న నూకలు చూసి   “ఎవరూ లేని ఈ అడవిలోకి ఈ నూకలు ఎలా వచ్చాయి!  ఇదేదో మోసంలా వున్నది,  వీటికి ఆశపడి పోయామంటే   బంగారు కంకణానికి ఆశపడి  ప్రాణాలు పోగొట్తుకున్న  బాటసారలా  అవుతుంది.  కనుక ఎవరూ  కిందకు దిగకుండా   ముందుకే వెళ్ళండి”  అని అచెప్పాడు.
మిగతా పావురాలన్నీ   “ బంగారు కంకణమేమిటీ, ప్రాణాలు పోటంఏమిటి!”  ఆ  కథ చెప్పమని  చిత్రగ్రీవుడిన అడిగాయి.

దానికి చిత్రగ్రీవుడు  బంగారు కంకణానిక  ఆశడి  పులి చేతిలో  తన ప్రాణాలు  పోగొట్టుకున్న బాటసారి  కథను ఇలా చెప్పసాగాడు.

బాటసారి – బంగారు కంకణం

ఓ పులి ముసలిదైపోయి వేటాడే శక్తి లేక,  ఆకలితో  బాధ పడసాగింది.  శారీరక శక్తి లేక  బుద్దితో  ఆహారాన్ని సంపాదించాలని అనుకుంది.  ఉపాయంతో  ఓ బంగారు కాంకణాన్ని  చేత పట్టుకుని  చెరువు గట్టు పై కూర్చుంది.

ఆ దారిలో  వెళుతున్న ఓ బాటసారి  పులి చేతిలోని బంగారు కాంకణాన్ని చూసి  ఆగాడు.  పులి సంతోషంతో   “నా దగ్గరకి రా వచ్చి ఈ బంగారు కంకాన్ని తీసుకో” అంది.   అందుకు  బాటసారి “కౄర జంతువువైన నిన్ను నమ్మి దగ్గరికి వస్తే నువ్వు నన్ను చంపేస్తావేమో” అన్నాడు.  దానికి పులి   “నేనింత కాలం ఎన్నో జీవులు చంపి తిన్నందుకు పశ్చాతాప పడుతున్నాను, ఇప్పుడు ములిదాన్ని అయ్యాను. వంట్లో బలం లేదు. నా పాపాలను తొలగించుకోవటానికి  ఈ బంగారు కంకణాన్ని దానం చేద్దానుకుంటున్నాను.  ఆ చెరువులో స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణాన్ని తీసకో నాకు పుణ్యం లభిస్తుంది  సంశయించకు”  అంది.

బాటారికి పులి మలు నమ్మకం కలిగించాయి. స్నానానికని చెరువులో దిగి బురదలో కూరుకుపోయాడు. అది చూసి పులి  బయటకు లాగుతానని చెప్పి  చంపి తినేసింది. “అత్యాశకు పోయి కౄర జంతవున నమ్మి ఈ గతి తెచ్చుకున్నాను, ఉచితంగా వస్తున్న దానికి   ఆశపడరాదు”  అనుకుంటూ  పులికి ఆహారమైనాడు బాటసారి.

ఆ కథ చెప్పి  చిత్రగ్రీవుడు “కనుక ఆ నూకలపై మనకు ఆశ వద్దు. వాటి వెనుక  ఏ ఆపద ఉందో తెలిదుకదా!”  అన్నాడు. దానికి వాటిలోని  ఓ వృద్దపావురం  “ఎక్కడో  ఏదో జరిగిందని  కళ్లఎదుట ఉన్న  ఆహారాన్న  వదులుకోవటం ఎందుకు?  ఇలా ప్రతిదాన్ని  అనుమానిస్తే సుఖం లేదు.  వెళ్లి ఆ నూకలు తింద్దాం పదండి.”  అంది.
ముసలి పావురం మాటలు విన్న పావురాలు  ఆశతో ఆహారంకై వెళ్లి ఆ వలలో చిక్కుకుని పోయాయి.  అప్పుడు వాటికి చిత్రగ్రీవుడి మాటల్లో నిజమేమిటో తెలిసింది. ” బుద్ది ఉన్నవాడే వృద్దుడుగాని నీలా వయసు  ఉన్న వాడ వృద్దుడా! నీ మాటలు నమ్మి చిక్కలో పడ్దాం”  అని ఆ ముసలి పావురాన్ని నిందించాయి.
దానికి  చిత్రగ్రీవుడు  “అతడిని అనటమెందుకు? మన బుద్ది ఏమయినట్టు.  ఇలాంటప్పుడే ఉపాయం ఆలోచించాలి, నేనొక ఉపాయం చెపుతాన,  మమందరం ఒక్కసారిగా  ఎగిరి  వలను మనతో తీసుకు వెళదాం. అందరూ ఒక్కసారిగా రెక్కలుకదల్చి పైకి ఎగరండి”   అన్నాడు.
అందరూ కలిస్తే ఎంతటి పనినైనా  సునాయాసంగా చేయవచ్చు,ఆన్న మాటలు నచ్చి  పావురాలన్నీ  వలతో పాటు ఆకాశ మార్గాన ఎగిరాయి.
వేటగాడు  ఆశ్చర్యపోతూ ఐకమత్యాన్ని మించిన బలమేమున్నది! అనుకున్నాడు.

“ఇప్పుడు మనమేం చేద్దాము, ఇలా ఎంతసేపని ఎగరగలము” అంటూ  మిగతా పావురాలు చిత్రగ్రీవుడిని అడిగాయి.
“ఇక్కడికి దగ్గరలోనే హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నాడు అతడు నాకు సన్నిహిత మిత్రుడు.  అతడు ఈ వలను కొరికి మనకు సహాయం చేయగలడు, ఈ లోకంలో ఎవరికైనా తల్లి తండ్రులు, స్నేహితులే నమ్మదగిన వారు.”  అన్నాడు చిత్రగ్రీవుడు.

అన్నీ కలిసి ఎగురుతూ  హిరణ్యకుడి  కలుగు దగ్గరకు వెళ్ళాయి.  హిరణ్యకుడు స్నేహితుడికి కలిగిన కష్టాన్ని చూసి విచారించి తన పళ్ళతో ఆ వల కొరికి వాళ్ళను బంధ విముక్తులను చేసాడు.

కనుక బుద్దిమంతుడైన వాడు  “మొదట మంచి స్నేహితులను సంపాదించుకోవాలి..”  అంటూ  మిత్ర లాభం  గురించి రాకుమారులకు చెప్పాడు విష్ణుశర్మ. తరువాత మరొక కథను చెప్పనారంభించాడు.

సశేషం