Subscribe

Archive for the ‘పాటలు’

ఇసుక తిన్నెలకు పాపిటి బిళ్ళలు

October 30, 2011 By: జాబిల్లి Category: పాటలు

రచన : కుసుమ
కొలనున తామర, కలువల్లు; 
అందాలకు విలువౌ  నెలవుల్లు ||

జలముల ఈదే నెలవంక; 
కొబ్బరిమట్టలు ఇచ్చునులే!; 
“చంద్రుని కెన్నో నూలుపోగులను ||

ఒడ్డున కులుకుతు లుకలుకలాడే 
పీతలు, నత్తలు, చిటి తాబేళ్ళు  
పరుగు పందెమున జమాజెట్టిలు ||

పిలలు కట్టిన పిచ్చుక గూళ్ళు; 
తీరములందున ఇసుక తిన్నెలకు; 
సింగారించిన పాపిటి బిళ్ళలు     ||

పెద్దల్లారా! శషభిషలెందుకు?; 
మీ ఉడుకుమోతుతనములు తొలగించి,
పిన్నలతోటి చేతులు కలిపి;   
శాంతితొ చేద్దురు సహవాసమును ||

అమ్మ లాలిపాట

October 25, 2011 By: జాబిల్లి Category: పాటలు

కూర్పు: మీనాక్షి

అనగనగా ఓ పాప…అమ్మ కడుపులో నించి అవని పైకి
చేరింది..అప్పుడే కళ్ళు విప్పింది..బిడ్డకు జన్మనిచ్చిన  గర్వంతో..ఎదురుగా అమ్మా..

” నిద్రపో నిద్రపో చిట్టి నా తల్లి
నిద్రకు నూరేళ్ళు నీకు వేయ్యేళ్ళు..”

అంటూ తల్లి రాగం తీస్తుండగా..పాటలోని
మాధుర్యమో అమ్మ ఒడిలోని వెచ్చదనమో  గానీ పాప హాయిగా నిద్రలోకి జారుకుంది..
నిద్ర నించి లేవగానే పక్కలో అమ్మ కనిపించక ఏడుపందుకుంది పాప..ఏదో పనిలో
ఉన్న తల్లి హడావుడిగా పరుగెత్తుకొచ్చి చిన్నారిని ఎత్తుకుంది..
(more…)