Subscribe

Archive for the ‘బాలలు వ్రాసిన కధలు’

ఉపాయం

December 04, 2010 By: జాబిల్లి Category: కథలు, బాలలు వ్రాసిన కధలు

: Lakshmi YSR

ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.ఒకరోజు ఆయన తన పొలం దున్నుతూఉంటే రాక్షసి ప్రత్యక్షమై ఆయనని తినడానికి ప్రయత్నిస్తుంది.కాని ఆయన తెలివిగా నన్ను తినవద్దు కావాలంటే నీకు  పండిన పంటలో సగం ఇస్తాను నన్ను వదిలెయ్యి అంటాడు. రాక్షసి అందుకు అంగీకరిస్తుంది. నీకు పై భాగం కావాలో కింది భాగం కావాలొ చెప్పు అంటాడు .అది నాకు క్రింది భాగం కావాలి అంటుంది. ఆరైతు వరి పంట వేసి పంట చేతికి రాగానే  కోసి ఒప్పందం ప్రకారం పైభాగం తాను తీసుకొని క్రింది భాగం రాక్షసికి ఇస్తాడు.

తాను మోసపోయానని తెలిసినా తనుకోరుకున్నది కాబట్టి ఏమీ చేయలేకపోతుంది. మరు సంవత్సరం  రైతు దున్నుతుంటే మరల రాక్షసి వచ్చి తనకు పై పంట కావాలి అని అడుగుతుంది. ఈ సారి రైతు వేరుశనగ పంట వేసాడు. వేరుశనగ పీకగానే  రాక్షసి తన వాటా కోసం వచ్చింది. చెప్పినవిధంగానే పైపంట రాక్షసికి ఇచ్చి కింది పంట తను తీసుకున్నాడు.మరలతను మోసపోయినట్లు గ్రహించింది రాక్షసి . ఈ సారి పైది కిందది రెండు కావాలని అడగాలనుకొంటుంది.

(more…)

పులి నక్క కథ

October 28, 2010 By: జాబిల్లి Category: కథలు, బాలలు వ్రాసిన కధలు

రచన   ;  maunisai

పూర్వం ఒక అడవిలో ఒక  నక్క  నివసించేది.  అది పూర్వజన్మలో చేసిన పాపాల  కారణంగా  అలా నక్క లా  పుట్టింది.  ఈ  జన్మలో అటువంటి పాపాలు చేయకుడదని నిర్ణయించుకుంది. అది ఆ అడవిలోనే్ మంచినక్క.  మాంసం ముట్టుకోకుండా కేవలం ఆకులు అలములతో  శాకాహారంతోనే కాలం గడుపుతూ ఉండేది.

ఆ అడవిలోని  పులి ఆ నక్క గురించి  విని  దానితో  స్నేహం చేయాలనుకుంది. నక్క వద్దకు వెళ్ళి  స్నేహితులుగా  ఉందామని  చెప్పి  తనతో  రమ్మని  అడిగింది.  పులి కౄరమృగం  దానితో స్నేహం ఇష్టంలేక  నక్క అంగీకరించలేదు.  ’నీ స్నేహం  నాకు  ముఖ్యం. నీ పద్దతి ప్రకారమే నేనూ  నడచుకుంటా”  అంటూ పులి  బ్రతిమిలాడింది.  నక్క లాగే తనూ నియమంగా ఉంటానని  పులి  చెప్పడంతో  నక్క  ఆ పులితో కలిసి  జీవించడానికి  ఒప్పుకుంది.

పులికి నక్క చెప్పేమాటలు  చాలా నచ్చేవి. అది  చెప్పినట్టుగానే  నడచుకునేది.  వాటి స్నేహం,  నక్క చెప్పినట్లుగా  పులి  వినడం  అదంతా   పులితో  కలిసి వుండే   మిగతా జంతువులకి  నచ్చలేదు. ఎలాగైనా   నక్కను  పులిని విడగొట్టాలనుకున్నాయి.     ఓ పధకం ప్రకారం పులి తెచ్చుకుని  దాచుకున్న  ఆహారాన్నంతా  నక్కకు  తెలియకుండా  నక్క వద్ద  పెట్టి,  పులి వద్దకు  వెళ్ళి  నక్క   ఆహారాన్ని  దొంగిలించింది  అని  చెప్పాయి.
పులికి నక్క మంచితనం  తెలుసు. ఐనా కూడా  నక్కని   చంపివేయమని  చెప్పేస్తుంది. అది  తెలుసుకున్న నక్క  పులిని  విడిచి వెళ్ళిపోయింది.  చెప్పుడు మాటల వలన  పులి  మంచి స్నేహాన్ని కోల్పోయింది.

నీతి ;  చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం.

mauni sai