Subscribe

Archive for the ‘బాలలు వ్రాసిన కధలు’

స్నేహం

October 13, 2009 By: Category: బాలలు వ్రాసిన కధలు

స్నేహం

రచన ;  వైష్ణవి (Vaishnavi, 8th class, Tirupati)

 

 

బన్నీ, సిద్ధూ, అభి, నందు  నలుగురు  స్నేహితులు. వాళ్ళు నలుగురు  ఒకే బడి  లో చదువుకునేవారు. ఒకసారి  సిద్ధూ బడికి    రాలేదు  ఆ రోజు అనుకోకుండా  స్కూలు కి మూడురోజులు  సెలవులు  ఇచ్చారు.   బుధవారం, గురువారం, శుక్రవారం  సెలవులు .

శుక్రవారం  సిద్ధూ  పుట్టినరోజు  వుంది. సిద్దు  తన స్నేfriends హితులను  పిలుచుకొని రావటానికి  వెళతాను  అన్నాడు.
సిద్ధూ వాళ్ళ నాన్నగారు  డ్రైవర్ తో  సిద్ధూ  స్నేహితుల  అడ్రెస్ చెప్పి పంపించాడు. బన్నీ వాళ్ళ ఇల్లు  సిద్ధూ ఇంటికి  చాలా  దగ్గరే కాబట్టి  మొదట బన్నీ ఇంటికి వెళ్ళారు.  సాయంత్రం పుట్టిన రోజుకి రమ్మని చెప్పారు.  అభి, నందు వాళ్ళ  దగ్గరకి  వెళుతున్నామని  చెప్పగానే  బన్నీ  కుడా వాళ్ళతో కలిసి  బయల్దేరాడు.
అభి, నందు వాళ్ళు వుండే  అపార్ట్ మెంట్  కొంచెం దూరం.  వీళ్ళు వెళ్ళేసరికి  అభి బయట ఆడుకుంటూ  కనిపించాడు. బన్నీ, సిద్ధూ  అభి వద్దకెళ్ళి  పుట్టిన రోజు గురించి చెప్పి, ఐదవ  అంతస్తు లోని  నందు ఇంటికి  వెళ్లాలని  అందరు  లిఫ్ట్  వద్దకు  వెళ్ళారు. అక్కడ వాచ్ మెన్  వీళ్ళను  చూసి  ఎవరింటికి వెళ్ళాలి  అని  అడిగాడు. సిద్ధూ చెప్పిన  నంబర్ విని  వాళ్ళు ఇప్పుడే  బయటకు  వెళ్లిపోయారు,  అని చెప్పాడు వాచ్ మెన్.
తరువాత అందరు  అభి ఇంటికి వెళ్ళారు.  అభి వాళ్ళ అమ్మ  అభిని ఇప్పుడే మీతో పాటు తీసుకు వెళ్ళండి  వాళ్ళ నాన్న రావాలంటే  చాలా  ఆలస్యం అవుతుంది అంది.  అభి ముస్తాబు అయి సిద్ధూ  బన్నీ తో కలిసి  వెళ్ళాడు.

నందు వాళ్ళ అమ్మ, నాన్న  బయటకు పోయారు కాని నందు ఇంట్లోనే వున్నాడు. వాళ్ళు వచ్చాక  నందు  ఆడుకోవటానికి  అభి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అభి వాళ్ళ అమ్మ  అభి  సిద్ధూ పుట్టినరోజుకి వెళ్ళాడని  చెప్పింది. అప్పుడు  నందు కి చాలా ఏడుపు వచ్చింది.  నన్ను  పిలవకుండా  అందరు పుట్టినరోజు  చేసుకున్నారు  వీళ్ళు నా స్నేహితులు కాదు అని అనుకున్నాడు.  సిద్ధూ పై కోపం వచ్చింది. ఇంకముందు  ఎప్పుడు  సిద్ధు తో మాట్లాడను  అనుకున్నాడు.

మర్నాడు  బడికి వెళ్ళగానే  సిద్ధూ  నందు దగ్గరకి వెళ్లి  చాక్లెట్స్, బొమ్మలు  ఇచ్చాడు.  నందు మాట్లాడకుండా  వున్నాడు   అప్పుడు  సిద్ధు   సారీ  చెప్పాడు.

నువ్వు ఇంట్లో  లేవని వాచ్ మెన్ చేప్పినందువల్ల  ఇది జరిగింది.  నువ్వు లేకపోతె  మాకు కూడా  బాగాలేదు  అన్నాడు.  అప్పుడు నందు జరిగింది  తెలుసుకున్నాడు.  తిరిగి నలుగురు  స్నేహంగా వున్నారు.

Vaishnavi, 8th class, Tirupati.

స్నేహం

July 02, 2009 By: Category: బాలలు వ్రాసిన కధలు

స్నేహం                     రచన : మౌని, చింటు

ఒక సింహానికి నదిఒడ్డుకు వెళ్ళి షికారు చెయ్యాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి పచార్లు చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండాగా దానికి నీటిలో డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళల్లో నుండి పైకెగురుతూ కిందికి పడడం చూసి దానిని భలే ముచ్చటెసింది.

Click to get cool Animations for your MySpace profile

. చాలా సేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సిహంనీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును. డాల్ఫిన్ తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది?’ అనుకొంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్   కు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరేనంది. తరువాత చాలా సేపు అవి కబుర్లు చెప్పుకొన్నాయి.

ఇంతలో సింహం పైకి అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రగా పోరాడింది. కాని, నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సయం చేయమని డాల్ఫిన్ను కోరింది. ‘నేను నీటిలో ఏమైనా చేయగలను. నేలమీదకు వస్తే అశక్తురాలినీ అని చెప్పి చూస్తూ ఉండిపోయింది. అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న అఖరికి అలసి తన దారిన తాను వెళ్ళిపోయింది.

అప్పుడు డాల్ఫిన్మిత్రమానువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానిని అర్థమేమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండటానికి తగనుఅని బాధపడింది. అప్పుడు సింహంనువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదయినా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి. నీటిలో కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికి స్నేహితులుగానే ఉందాం. అని చెప్పి అక్కడినుండి వెళ్లిపోయింది .