Subscribe

Archive for the ‘మీకు తెలుసా’

ఉరుముడు పువ్వు కథ

By: jabilli Category: మీకు తెలుసా

రచన : N.Raveender


బాలలూ !  మీరెప్పుడైనా  ఉరుముడు పువ్వును చూసారా
? ఆకాశం ఉరిమిన వెంటనే మొగ్గలా ముడుచుకున్న ఈ పువ్వు పూర్తిగా తన రేకుల్ని విచ్చుకుంటుంది . ఎందుకలా జరుగుతుంటుంది ? దీని వెనుక ఓ కథ ఉంది వినండి.

పూర్వం ఒకసారి ఉరుము దేవేంద్రుడి వద్ద కెళ్ళి ” దేవేంద్రా ! సూర్య కిరణాలు సోకగానే కమలం వికసిస్తుంది. చంద్ర కాంతి పడగానే కలువ విరబూస్తుంది. నల్లని  మేఘాల గుంపును చూడగానే నెమలి నాట్యం చేస్తుంది. ఇలా సూర్యుడు, చంద్రుడు, మేఘుడు కావ్యాలలో స్థానం సంపాదించుకున్నారు. కానీ నా ఉరుము శబ్దం వింటేనే అందరూ బెదరి   పోతారు. సంతోషించే వారు ఎవరూ లేరు .”అని తన భాదను చెప్పుకుంది.

అప్పుడు దేవేంద్రుడు అలోచించి ,ఉరుముకు అభయమిచ్చి ఉరుముడు పువ్వును సృష్టించాడు.

మీకు తెలుసా

By: Category: మీకు తెలుసా

కరెంటు  తీగపై  వాలిన  పక్షులు  విద్యుద్ఘాతానికి  గురికావు.  ఎందుకని?

సామాన్యముగా   పక్షి  ఒకే  తీగపై  కూర్చుంటుంది.  పక్షి  శరీరం  తీగ  సమాంతర  వలయంగా  ఏర్పడి  దాని  రెండు  కాళ్ల మధ్య  పొటెన్సియల్‍లో   తేడా  ఏర్పడదు.  అందువల్ల  అది   విద్యుద్ఘాతానికి  గురికాదు.
అలా  కాకుండా ( ఆ తీగపై ఉండి )   పక్క తీగను  తాకినా  లేదా  భూమిని  తాకినా  అది  విద్యుద్ఘాతానికి  గురవుతుంది.

కొన్ని  మాల్స్  లో  మనం  వెళ్ళగానే  తలుపులు  వాటంతట అవే  తెరచుకుంటాయి  అదెలాసాధ్యం?
ఆ  తలుపుల  పక్కన  ఏర్పాటు  చే్సిన  డిటెక్టర్  ద్వారా  మైక్రోతరంగాలు  ప్రసారమవుతూ  ఉంటాయి. అవి  అక్కడికి  వచ్చిన  వారిని  తాకి  పరావర్తనం చెంది   డిటెక్టర్ ను   చేరతాయి.  తలుపుకి  మనకు  మధ్యనున్న  దూరాన్నిబట్టి  తరంగాల  ఫ్రీక్వె‍న్సీ  మారుతుంది.  ఆ  ఫ్రీక్వె‍న్సీ  ని  ప్రత్యేక  యంత్ర  పరికరానికి  అనుసంధానించి  తలుపు  తెరచుకునేట్టు  చేస్తారు.

ప్రపంచంలో   సగం  జనాభాకు  ప్రధాన  ఆహారం  వరి.

నిప్పుకోడి  గుర్రం కన్నా  వేగంగా   పరిగెత్తగలదు.