Subscribe

Archive for the ‘వివిధ’

జులై జాబిల్లి సంచికలో…

By: Category: వివిధ

జాబిల్లి  జూలై సంచికకు  స్వాగతం. ఇకపై    జాబిల్లిని  కొత్త డొమైన్  http://www.jabilli.in లో చూడవచ్చు.

సంచిలో….

పాటలు

అనిల్ పిదూరి గారు   జాబిల్లి కోసం   రాసిన  గేయం  –   జాబిల్లి

తుమ్మల సీతారామమూర్తి   గారి  రచన   —     మహాత్ముడు

మరొక  బాలల గేయం          —–     కృష్ణాష్టమి


వ్యాసాలు

చెట్టు కథ —–   krg

తమాషా  లెక్కలు —-   krishna

ఆగస్టు  నెల —  krg

జూలై  నెల —   krg

విహార యాత్రా  చిత్రాలు —    bittu

చేసి చూద్దాం
బిట్టు  చేసి చూపించిన  —–   కాగితంతో  బొమ్మ


కథలు

మౌని, చింటూ  రాసిన కథ  —  స్నేహం
అపరంజి  రాసిన  కథ       —  చందు – సూర్య

అవ్వ  చెప్పిన  కథలు

అనగనగా  పేను కథ

ఏడు చేపల కథ

ఒక్క వెంట్రుక రాణి  కథ

ఇంకా

పంచతంత్రం

మీకు  తెలుసా

సరదా  సరదా

ఆటలు

ప్రయాణంలో  ఒక సరదా  ఆట బిట్టు

ఒక మంచిమాట

కాగితంతో బొమ్మ

By: Category: చేసిచూద్దాం, వివిధ

కాగితంతో  బొమ్మ  –   (బిట్టు)

కావలసిన వస్తువులు:

దలసరిగా ఉన్న రంగు కాగితాలు
కత్తెర
స్టాపులర్
చిన్న మూత ( ఏదైనా సీసా మూత బొమ్మ తలకి సరిపడేల ఉన్నది)
ఊలు
పెవికాల్

చేయు విధానం:

1) కాగితం పై కావలసిన  సైజుకి వృత్తం గీసుకుని దాన్ని కత్తిరించి తిరిగి దాన్ని మధ్యకు మడచి కత్తిరించి రెండుభాగాలుగా చేయాలి. ఒక భాగాన్ని తీసుకుని కోన్ ఆకారంలో మడచి దానికి స్టాపులర్‍తో పిన్ చేయాలి.

2) మరొక రంగు కాగితం పై దానికంటే కాస్త చిన్న వృత్తం గీసి దాన్ని కత్తిరించి మధ్యకు మడచి ముందు చేసుకున్న కోన్ ఆకారంపై అమర్చి వెనక పిన్ చేసుకోవాలి.

3) మూతని కాగితం తో చుట్టి తల తయారు చేసుకోవాలి. దానికి కళ్ళు ముక్కు నోరు గీయాలి. ఊలుతో దానికి జుట్టు అతికించాలి.(ఆడపిల్ల బొమ్మ ఐతే జడలు పిల్లాడి బొమ్మ ఐతే పొట్టి జుట్టు అమర్చుకోవాలి)

4) బొమ్మ టోపికోసం పలచటి రంగు కాగితంతో కోన్‍ చేసి బొమ్మ తలపై పెవికాల్ తో  అతికించాలి.

ఇప్పుడు బొమ్మకి తల అతికించాలి.