మేటివిలుకాడు
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
బటన్ అనేరాజ్యాన్ని పరిపాలించే రాజుకు విలువిద్య అంటే ప్రాణం.అనేకమంది రాజులు,సంపన్నులు,గుర్రపుస్వారీ,ఆటపాటలు,వస్తాదుల కుస్తీ పోటీలతో కాలక్షేపం చేస్తుంటే ఈరాజుకు మాత్రం విలువిద్యను మించిన వ్యాపకం మరొకటిలేదు.రాజాస్థానంలోని మంత్రులు,ఉద్యోగులకు రాజకీయాలు,భక్తి,సాహిత్యాలను గురించి చర్చించుకోవటం ఇష్టమయినా రాజు కొరకు వాళ్ళందరూ తమ సంభాషణలను విలువిద్యమీదకే మళ్ళించేవారు.
ఆ రాజ్యంలో ఎందరో యువకులు రాజుగారి కుమార్తెను పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరుతుండేవారు.ఆ విషయమై ఎన్నో ప్రయత్నాలు కూడా చేసారు.కానీ,గొప్ప విలుకాడు అయిన వీరుడికే తనకుమార్తెను ఇచ్చి వివాహాం చేస్తానని రాజు స్పష్టం చేసాడు.ఆసంగతి ఆనోటా,ఈనోటా దేశమంతటా పాకింది. (more…)

