ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ఉన్నాయి
రచన : రాజేంద్రకుమర్ దేవరపల్లి
పొలంలో పనులన్నీ ముగించుకుని ఒక రైతు సాయంత్రం యింటికి తిరిగివస్తున్నాడు.బాగా అలసిపోయి ఉండటంతో,ఎప్పుడెప్పుడు ఇల్లుచేరి స్నానం చేసి,భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామా అని అతని మనసు తహతహలాడుతుంది.అలా నడుస్తూ ఒకరాళ్లగుట్ట దగ్గరకు వచ్చాడు.ఆరాళ్ళ సందుల్లో ఒకపులితోక ఇరుక్కుని,చాలా పెద్దది,కిందకీ,పైకీ కదులుతోంది.
రైతు భయంతో వణికిపోయాడు.పులితోకను వదిలించుకుని రైతుమీదకు దూకాలని ప్రయత్నించింది.కానీ రైతు పులితోకను అతనివైపుకు లాగాడు.పులి భీభత్సంగా గర్జిస్తూ,బుసలుకొడుతుంది.రైతు చెమటతో ప్రాణభీతితో తడిసి ముద్దయి పోయాడు.కొంతసేపయ్యాక అ దారివెంట ఒకముని వెళుతూ కనిపించాడు.
ఓహొ!దేవుడే ఈ సాధువును పంపించాడని భావించి.‘స్వామీ,అదిగో నేలమీద నా కొడవలి ఉంది,ఈపాడు పులిని చంపి నాప్రాణం కాపాడండి’అంటూ బతిమలాడాడు రైతు.ఆ ముని రైతు వైపు ప్రశాంతంగా చూసి ‘ప్రాణాలు తీయటమనేది నా సిద్ధాంతాలకు విరుద్ధం’ అన్నాడు. ‘అయ్యో అవేం మాటలు స్వామీ,నేను ఈ తోకను వదిలేస్తే పులి నామీద పడి హతమారుస్తుంది’అని వేడుకున్నాడు.‘నేనేం చెయ్యలేను నాయనా,మా మతవిశ్వాసాల ప్రకారం,ఏజీవరాశి ప్రాణం తీయకూడదు’శెలవిచ్చాడు ముని.‘మీరు నాకు సాయం చెయ్యకపోతే ఈ పులి నన్ను చంపుతుంది,అప్పుడు నాచావుకు కారణం మీరే అవుతారు గదా! అని తర్కించాడు రైతు.దానికి కూడా,‘అడవిలో బలమైన జంతువు బలహీనమైన ప్రాణిని చంపటమనే సామాన్య ఆటవిక న్యాయముంటుంది,దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను,శాస్త్రాలలో జీవహింస చేయకూడదూ అని ఆజ్ఞాపించారు’అంటూ చెప్పుకొచ్చాడు మునివర్యుడు. (more…)
