కోతి తెచ్చిన తగవు
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
పూర్వం అడవిలో జంతువులన్నీ స్నేహితుల్లా కలసిమెలసి ఉండేవి.కొంతకాలానికి ఒక చిన్న తగాదా వచ్చి
రెండు వర్గాలుగా విడిపోయాయి. అది ఎలా జరిగిందంటే…
ఒక రోజు మట్జన్ అనే పులి,గడ్జా అనే ఏనుగు అడవిలో షికారుగా,కబుర్లు చెప్పుకుంటూ
నడుస్తున్నాయి.అలా కొంత దూరంపోయాక మట్జన్ తలెత్తిచూసింది.అలా చూసేసరికి లోటంగ్ అనే కోతి
కొమ్మలమీదుగా వాటిని అనుసరించి వస్తున్నట్టు గ్రహించింది.లోటంగ్ ఏదేదో అంటూ తన కోతిచేష్టలతో
మట్జన్ కు కోపమొచ్చేలా చేసింది.‘లోటంగ్ అంటేనే నాకు చిరాకు,చూడు, మనమేదో్ మాట్లాడుకుంటూ ఉంటే
అది పొంచిమనమాటలు వింటోంది,పైగా,మనతో మాటలు కలపాలని చూస్తుంది.ఇక లాభం లేదు,నువ్వు Read the rest of this entry →



