శాంతాక్లాజ్ డ్రస్సు క్రియేటర్

December 23, 2012 By: Category: మీకు తెలుసా

By: kusuma
హాడన్ సాంద్ బ్లోమ్ ఒక ఆర్టిస్టు.
Haddon Hubbard Sundblom 
(June 22, 1899 – March 10, 1976) గ్రాఫిక్ డిజైనర్; 
ప్రస్తుతము ఆతనిని గుర్తుకు తెచ్చుకోవడము ఏలనో? 
క్రిస్టమస్ పండగ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే తాత ఎవరు? 
గుబురు గడ్డము, బుర్ర  మీసాలు, ఎర్రని ఫర్ కోటు, red ప్యాంటు; 
బఫూన్ టోపీ తెల్లని ఉన్ని అంచుల మేళవింపులతో… 
ఆ! అతనే “క్రిస్మస్ తాత” ఉరఫ్ “శాంతా క్లాజ్”!!!!!!!!!!!  
క్రిస్ మస్ తాత” ఇజీక్వల్టు “శాంతా క్లాజ్“, 
రూపు రేఖలకు సృష్టికర్త  హాడన్ సాండ్ బ్లోమ్!   
Christmas Festival సమయ సందర్భాలు కలిసి వచ్చినవి, 
కాబట్టి  హాడన్ సాండ్ బ్లోమ్ అనే  artist ని 
ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాము!  
 
++++++++++++++++++++  
 
సన్ బ్లోమ్ భావనలకు స్ఫూర్తి మూర్ రచించిన ప్రఖ్యాత పద్యం ……! 
క్లెమెంట్ క్లార్క్ మూర్ ( (Clement Clarke Moore ) 
1822 లో రాసిన Poem “ఎ విజిట్ ఫ్రమ్ సైంట్ నికొలస్” 
(“1822 poem, “A Visit From St. Nicholas”  అది!                        
“ఇట్ వాస్ ది నైట్ బిఫోర్ క్రిస్ట్మస్” 
(“Twas the Night Before Christmas”) అనే శీర్షికతో పాప్యులర్ ఐనది.         
సైంట్ నికొలస్ పేరు కాల క్రమేణా “శాంతాక్లాజ్” గా అవతరించాడు. 
ఈ పరిణామం కేవలము “పేరు“నకు మాత్రమే కాదు, 
వేషమునకు సైతము వర్తించినది. 
“కోకో కోలా కంపెనీ” కోరిక మీద 
హాడన్ సాంద్ సన్ బ్లోమ్ కొత్త బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. 
శాంతాక్లాజ్ క్రిస్టమస్  1931 ల నుండి “Santa Clause painting” 
వేసే ప్రయత్నాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహించాడు
సన్ బ్లోమ్ రూపొందించిన “శాంతాక్లాజ్ చిత్రము” 
సరి కొత్త దుస్తులతో “శాంతాక్లాజ్” ను ఆవిష్కరించినది.
అంతకు పూర్వము ఆకుపచ్చ మున్నగు రంగులతో శాంతాక్లాజ్ దుస్తులు ఉండేవి. 
సన్ బ్లోమ్ చిత్రణలోని “శాంతాక్లాజ్ ఆహార్య, వేషధారణలు” 
క్రమంగా కొత్త మైలు రాయిని నెలకొల్పిందని చెప్పక తప్పదు. 
ఎర్రని కోటు, ఉన్ని టోపీ, బూట్లు – 
ఇంత మేలిమి డ్రస్సులతో ధగ ధగా మెరుస్తూన్నాడు నేటి  శాంతాక్లాజ్. 
******************************
 
హాడన్ సాండ్ బ్లోమ్ పొరుగింటిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. 
క్రిస్ట్ మస్ వేడుకల తరుణాలలో 
“మాకు ఏమి తెచ్చావు తాతా? 
మాకు ఇంకా కావాలి, ఉండు, నువ్వు నాకు కావల్సినవి తేలేదని 
అమ్మ నాన్నకు చెబుతాను!” అంటూ మారాము చేసేవారు.
 ఇరువురు అమ్మాయిలు కూడా తన బొమ్మలకు అందచందాలను చేకూర్చారు. 
ఐతే Mr. Blomsand “రెండో స్థానంలో అబ్బాయిని వేసి, పరిపుష్ఠి చేకూర్చాడు.
శాంతాక్లాజ్ ను తనివితీరా అనేక ఫోజులతో చిత్రించి, 
మాగజైన్సు లకు కొత్తకోణాలు గల తాత బొమ్మలను అందించాడు.
******************************
 
సన్ బ్లోమ్ సృజన“శాంతాక్లాజ్” picture
కోకోకోలా ప్రకటనా సామ్రాజ్యానికి చిర కీర్తిని ఆర్జించిపెట్టినది కదూ!                      
“అందరికీ మెర్రీ క్రిస్ట్ మస్!” 
 
******************************
 
శాంతాక్లాజ్ రాకకై ఎదురు చూస్తూన్న బాలబాలికలకు శుభాకాంక్షలు! 
“శాంతాక్లాజ్ స్వరూపానికి పునాది” అని 
ఆంగ్ల సాహిత్య లోకాన ఉన్న కవితను ఈ లింకు లో చూడండి!   

2 Comments to “శాంతాక్లాజ్ డ్రస్సు క్రియేటర్”


  1. శాంతా క్లాస్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు

    1
  2. Thank you! హేమలత గారూ!

    2


Leave a Reply